MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cholesterol: ఈ పండ్లు కొలెస్ట్రాల్ ను వెన్నలా కరిగించేస్తాయి..

Cholesterol: ఈ పండ్లు కొలెస్ట్రాల్ ను వెన్నలా కరిగించేస్తాయి..

Cholesterol: వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 13 2022, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
cholesterol

cholesterol

30 ఏండ్లు దాటాయో లేదో.. రకరకాల జబ్బుల బారిన పడుతున్న వారు చాలా మందే ఉంటున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, ఒత్తిడి, మూత్రపిండాల సమస్యలు, కాలెయం వంటి ప్రమాదరకమైన రోగాలు సైతం 30 ఏండ్ల వారికి కూడా సోకుతున్నాయి. అంతేకాదు ఈ రోగాల లీస్ట్ లో అధిక కొలెస్ట్రాల్ కూడా ఉంది. కొలెస్ట్రాల్ ప్రమాదకరమైన జబ్బులకు దారితీస్తుంది. గుండెపోటు, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక రోగాలకు కొలెస్ట్రాల్ యే మూలకారణం అంటున్నారు నిపుణులు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బిజీ లైఫ్ స్టైల్, శరీరక శ్రమ లేకపోవడం, ప్యాకెట్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలి. అయితే కొన్ని రకాల పండ్లు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

అరటి పండ్లు (Banana)

అరటి పండ్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పొటాషియం, పీచుపదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అరటిపండ్లు శరీరంలోని పోషకాలను భర్తీ చేయడంతో పాటుగా రోగనిరోధక శక్తిని కూడా పెంచతాయి. 
 

 

47

ఆపిల్స్ (Apples)

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణ ఉంచడంలో ఆపిల్స్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీనిలో పాలీఫెనాల్స్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో అధనంగా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే దీనిలోని పీచుపదార్థం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

57
avocado

avocado

అవొకాడో (Avocado)

అవకాడో మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో మన  శరీరానికి మేలు చేసే ఎన్నో పదార్థాలు ఉంటాయి. దీనిని రెగ్యులర్ గా తింటే ఎలాంటి అనారోగ్యం మీ దరిచేరదు. ముఖ్యంగా ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి పోషణను కూడా అందిస్తుంది. దీనిని ఉదయం టోస్ట్ లేదా స్మూతీగా లేదా సాండ్విజ్ తో తినొచ్చు.
 

67

పైనాపిల్ (Pineapple)

శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పైనాపిల్ కూడా సహాయపడుతుంది. ఈ పండు ధమనుల నుంచి కలుషితమైన రక్తాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా  దీన్ని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.  కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఈ పండును తింటే శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటుంది. 
 

77

ప్రతిరోజూ ఒక సీజనల్ పండును తిన్నా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సీజనల్ పండ్ల వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.  వీటితో పాటుగా సమతుల్య ఆహారం తీసుకోండి. రెస్టారెంట్ ఫుడ్ ను తినడం మానుకోండి. కాల్షియం, విటమిన్లు, పోషకాలతో నిండిన ఆహారాలను ఎక్కువగా తినండి. అలాగే రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి. అప్పుడే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే.. 90 శాతం మందికి నిజంగా తెలియదు!
Recommended image2
Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి
Recommended image3
Chanakya Niti: 30 ఏళ్లు రాకముందే ఇవి నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకోవాలన్నా నేర్చుకోలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved