cholesterol reduce tips: ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఇట్టే కరుగుతుంది..
cholesterol reduce tips: మారుతున్న జీవనశైలి కారణంగా ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడం పెద్ద సవాలుగా మారింది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగితే గుండె పోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.

High Cholesterol
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడం అసాధ్యంగా మారుతోంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే మాత్రం గుండె ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతేకాదు అధిక కొలెస్ట్రాల్ గుండెపోటుకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మాత్రం మీరు తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
High Cholesterol
కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది మంచి కొలెస్ట్రాల్ అయితే.. రెండోది చెడు కొలెస్ట్రాల్. మన శరీరంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి చిక్కూ రాదు. అదే చెడు కొలెస్ట్రాల్ పెరిగితేనే అసలుకే మోసం వస్తుంది. ఇది పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించొచ్చు. అవేంటంటే..
వెల్లుల్లి.. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇది ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా వెల్లుల్లి మన శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ.. గ్రీన్ టీ ఓవర్ వెయిట్ ను తగ్గించడమే కాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు క్రమం తప్పకుండా గ్రీన్ టీని తాగుతూ ఉండండి. అదికూడా పరిమితిలోనే..
పసుపు పాలు.. పసుపు కలిపిన పాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. నిత్యం ఏదో ఒక రోగం బారిన పడేవారు తమ రోజు వారి ఆహారంలో పసుపు పాలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు పాలలో ఉన్నాయి.
అవిసె గింజలు.. అవిసె గింజలు కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో ఉపయోపగపడుతుంది. వాస్తవానికి ఈ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు , లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.