ఉప్పు, చక్కెరలో ఏదెక్కువైనా మీ గుండెకు గండమే..!
పలు అధ్యయనాల ప్రకారం.. ఉప్పు, చక్కెరలు మనకు ఎంత మంచి చేస్తాయో.. అవి మోతాదుకు మించితే.. అంతకు మించి ఎక్కువ హానీ చేస్తాయని నిరూపించబడింది.

చాలా మంది ఆకలైతే చాలు ఏదో ఒకటి లాగించేస్తుంటారు. వాళ్లు తినేది ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా అన్న విషయాన్ని పట్టించుకోరు. మనం చూసేది కడుపు నిండిందా? లేదా? అనేది మాత్రమే. ఇలాంటి అలవాట్లే ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాలలో నివేదించబడినట్లుగా.. అధిక ఉప్పు (Salt), చక్కెర (Sugar), ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకోవడం హృదయ సంబంధ వ్యాధుల (Cardiovascular diseases) ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు ప్రతిరోజూ తినే కొన్ని ఆహారపు అలవాట్లు మీకు హాని కలిగిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వైట్ బ్రెడ్ (White bread): వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల ఊబకాయం (Obesity), గుండె జబ్బులు (Heart disease), మధుమేహం (diabetes) వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీనిలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం (Flatulence), మలబద్ధకం (Constipation), యాసిడ్ రిఫ్లక్స్ ను ప్రేరేపిస్తుంది. పరిశోధనల ప్రకారం.. వైట్ బ్రెడ్ శోషించుకోబడుతుంది. వేగంగా జీర్ణమవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు వైట్ బ్రెడ్ తినడం మానుకోండి.
టొమాటో సాస్ (Tomato sauce): సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, సైడ్ డిప్ గా కెచప్ (Ketchup) లేదా టొమాటో సాస్ (Tomato sauce)ఉత్తమ కలయిక. ఇది అందరికీ చాలా నచ్చుతుంది. దీని రుచి ఉప్పగా, పుల్లగా, తియ్యగా.. మళ్లీ మళ్లీ తినాలనిపించేట్టుగా ఉంటుంది. ఇందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ సమస్యకు కారణమవుతుంది.
చైనీస్ ఫుడ్ (Chinese food): చైనీస్ ఆహారాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. చిన్న పిల్లల నుంచి పెద్దవారు సైతం ఇంట్లో వండిన ఫుడ్ కు బదులుగా దీన్ని తినడానికే ఇంట్రెస్ట్ చూపుతారు. ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచురియా వంటివెన్నో నోటికి రుచిగా అనిపిస్తాయి. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఇందులో ఉప్పు (Salt), కొవ్వు (Fat), చక్కెర (Sugar) అధికంగా ఉంటాయి. ఇది మీ రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
తృణధాన్యాలు (Cereals): చాలా మంది రెగ్యులర్ గా తృణధాన్యాలను తింటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్ని కొన్ని సార్లు ప్రాణాంతకం కావొచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాపు వస్తుంది.
జ్యూస్ (Juice): వేసవి తాపాన్ని తీర్చడంలో జ్యూస్ లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అయితే ఇంట్లో తయారుచేసిన జ్యూస్ ల వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే దీనిలో చక్కెర తక్కువగా ఉంటుంది. అదే బయట తాగే జ్యూస్ లో చక్కెర ఎక్కువ మొత్తంలో కలుపుతారు. ఇది ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.
బంగాళాదుంప చిప్స్ (Potato chips): బంగాళదుంప చిప్స్ నోటికి రుచిగా అనిపించినా.. ఇందులో కేలరీలు (Calories), ఉప్పు (Salt), కొవ్వులు (Fats)అధికంగా ఉంటాయి. ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి చిప్స్ ను ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రయత్నించండి.
heart attack
పైన పేర్కొన్న అన్ని ఆహారాలు కూడా ఆరోగ్యకరమైనవని అనుకోవద్దు. క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు ఈ ఆహారాలను తీసుకోవడం తగ్గించండి.