Covid Case ₹21 లక్షల కోట్ల జరిమానా కట్టండి! కొవిడ్ కేసులో చైనాకు అమెరికా అల్టిమేటమ్!!
కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగానో అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో పీపీఈ కిట్లు, వైద్య పరికరాల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతిని చైనా అడ్డుకుందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఓ కేసు నమోదైంది. ఇందులో తీర్పు చైనాకు వ్యతిరేకంగా వచ్చింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రూ.21లక్షల కోట్ల జరిమానా
కోవిడ్-19 సంబంధిత పరికరాల కేసులో అమెరికా కోర్టులో చైనాపై మిస్సోరి ప్రభుత్వం వేసిన కేసులో తీర్పు వచ్చింది. సంబంధిత కేసులో చైనా లెక్కలు తారుమారు అయ్యాయి.
భారీ నష్టపరిహారం
చైనా ఓటమి కారణంగా భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చైనా 2400 కోట్ల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. ఇది భారతీయ కరెన్సీలో ₹21 లక్షల కోట్లు.
కేసులోని అంశం
కరోనా సమయంలో పీపీఈ కిట్లు, వైద్య పరికరాల ఉత్పత్తి, కొనుగోలు, ఎగుమతిని చైనా అడ్డుకుందని ఆరోపణలు వచ్చాయి. కరోనా మహమ్మారి సమయంలోనే ఈ కేసు దాఖలైంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత అమెరికా ఫెడరల్ జడ్జి తీర్పు చెప్పారు.
న్యాయమూర్తి వ్యాఖ్య
ప్రపంచానికి కోవిడ్-19 వ్యాప్తి చేసినందుకు చైనాపై పోరాటంలో ఇది మిస్సోరి, అమెరికాకు ఒక మైలురాయి లాంటి విజయమని మిస్సోరి అటార్నీ జనరల్ అన్నారు. ఈ కేసులో చైనా తరఫున ఎవరూ కోర్టుకు హాజరు కాలేదు. అయినా కేసు విచారణ జరిగింది. కోర్టుకు ఎవరూ రాలేదని, దీని అర్థం మీరు తప్పించుకోగలరని కాదని న్యాయమూర్తి చైనాను హెచ్చరించారు.
సోషల్ మీడియా పోస్ట్
మిస్సోరికి చైనా 2400 కోట్ల డాలర్లు ఇవ్వాలని, కోర్టులో గెలిచామని, డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు.