- Home
- Life
- Children's Health: మీ పిల్లలు పదే పదే అనారోగ్యానికి గురవుతున్నారా? దానికి కారణం ఈ విటమిన్ లోపమే ..
Children's Health: మీ పిల్లలు పదే పదే అనారోగ్యానికి గురవుతున్నారా? దానికి కారణం ఈ విటమిన్ లోపమే ..
Children's Health: డి విటమిన్ తగ్గితే పిల్లలో రోగ నిరోధక శక్తి (Immunity)తగ్గుతుంది. శరీరం బలహీన పడుతుంది. పదే పదే అనారోగ్యం బారిన పడతారు. అందుకే వీరికి డి విటమిన్ (Vitamin D) పుష్కలంగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తినిపించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పిల్లలకు డి విటమిన్ (Vitamin D) చాలా అవసరం. ఈ విటమిన్ పిల్లల్లో సరిపడినంతగా ఉంటేనే వారి శారీరక ఎదుగుదల బాగుంటుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపిస్తే పిల్లల్లో రోగ నిరోధ శక్తి (Immunity)బలహీనపడుతుంది. దీంతో పిల్లలు బలహీన పడతాయి. పదే పదే రోగాల బారిన పడుతుంటారు.
vitamin d
పిల్లల్లో డి విటమిన్ పుష్కలంగా ఉండేనే వారి ఎముకలు (Bones) బలంగా అభివృద్ధి చెందుతాయి. దంతాలు (teeth) కూడా గట్టిగా ఏర్పడతాయి. లేదంటే దంతాల సమస్యల బారిన పడతారు. ఈ సమస్యలు రాకూడదంటే పిల్లలకు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తినిపించాలి.
విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు
గుడ్లు (Eggs): గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిలో పోషకాలు (Nutrients)పుష్కలంగా ఉంటాయి. గుండ్లులోని పచ్చ సొన లో విటమిన్ డి ఉంటుంది. పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డును తినిపించండి.
ఆవు పాలు (Cow's milk): ఆవు పాలు కూడా సంపూర్ణ ఆహారం కిందికే వస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ ఒక గ్లాస్ పాలను పిల్లలకు తాగించడం వల్ల వారి శరీరానికి అవసరమయ్యే డి విటమిన్ లభిస్తుంది. ఎముకలను, దంతాలను బలంగా ఉంచే కాల్షియం (Calcium)కూడా పాలలో పుష్కలంగా ఉంటుంది.
పెరుగు (curd): పెరుగు కూడా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్ గా పిల్లలు పెరుగును తింటే బలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ డి (Vitamin D)పుష్కలంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పెరుగును కలుపుకుని తింటే ఎంతో మంచిది.
పుట్టగొడుగులు (Mushrooms): పిల్లలకు పుట్టగొడుగులు ఎంతో మంచి చేస్తాయి. వీటిని పిల్లలు రోజూ తినాలి. వీటిలో విటమిన్ బి1 (Vitamin B1), విటమిన్ బి2, విటమిన్ బి5 (Vitamin B5), విటమిన్ సి, మెగ్నీషియం (Magnesium) పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది.
నారింజ పండ్లు (Oranges): నారింజ పెద్దలకే కాదు పిల్లలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ డి (Vitamin D) , కాల్షియం (Calcium) వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.