MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గుండెపోటు ప్రారంభ సంకేతాలు.. ఏమాత్రం కేర్ లెస్ గా ఉన్నా ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త..

గుండెపోటు ప్రారంభ సంకేతాలు.. ఏమాత్రం కేర్ లెస్ గా ఉన్నా ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త..

సైలెంట్ కిల్లర్ గుండెపోటు బారిన పడి నేడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ గుండెపోటు నుంచి బయటపడాలంటే గుండెపోటు ప్రారంభ సంకేతాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 05 2022, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
heart atack

heart atack

ఇండియాలో గుండెపోటు రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే కొంతమంది కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వల్లే ఇది జరిగిందని అనుకున్నారు. దీనిని ఏ పనిశోధనలు నిరూపించలేదు. కాబట్టి ఇందులో వాస్తవం లేదు. ఒకప్పుడు గుండెపోటు 50 ఏండ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 25 ఏండ్ల యువకులు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నార సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
heart attack

heart attack

అయితే గుండెపోటు దాని సంకేతాలు, లక్షణాలతో  వస్తుంది. కానీ అవి ఇతర సమస్యల లాగే ఉండటంతో చాలా మంది వాటిని పట్టించుకోరు. దీని మూలంగానే చాలా మంది అర్దాంతరంగా చనిపోతున్నారు. అయితే కొంతమందిలో పెద్దగా లక్షణాలేమీ కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. గుండెపోటు సంకేతాలైన అలసటను తేలిగ్గా తీసుకునే వారు చాలానే ఉన్నారు. అయితే గుండెపోటు ప్రారంభ సంకేతాలేంటి? దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

అలసట, వికారం, చల్లని చెమటలు

మీకు బాగా వికారంగా ఉన్నా, గుండె బరువెక్కినా, వాంతుల వచ్చినా, విపరీమైన చెమట పట్టి మేల్కొన్నా నిమిషం ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెల్లడం మంచిది. ఎందుకంటే ఇవి గుండెపోటుకు ముందు వచ్చే సంకేతాలు. అలాగే అలసటను కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మీరు సమయం ప్రకారం.. నిద్రపోయినా, ఎక్కువ పనులు చేయకపోయినా అలసిపోయినట్టుగా అనిపిస్తే.. ఖచ్చితంగా మీ గుండె ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం చేసుకోండి. 
 

46

ఛాతీ నొప్పి, గుండెలో సంపూర్ణత లేదా ఒత్తిడి

ఏ రకమైన గుండెపోటు వచ్చినా ఛాతిలో నొప్పి పుడుతుంది. ఇది మీ ఎడమ చేతి నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని భాగాలకు వ్యాపిస్తుంది. అదికూడా భారీ వస్తువును ఎత్తిన తర్వాత ఎలా అయితే నొప్పి కలుగుతుందో అలా అన్నమాట. దీన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనా ఈ రకమైన ఛాతీ నొప్పి లేదా గుండెపై ఒత్తిడి పడుతున్నట్టుగా అనిపించినా వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది. అవసరమైన టెస్ట్ లు చేయించుకోండి. మందులను వాడండి. 

56

మైకము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

బ్రోన్కైటిస్ లేదా ఇతర రకాల ఊపిరితిత్తుల సంక్రమణతో ఇబ్బందిపడుతున్న వారు కాకపోయినా.. మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గుండెపోటు వచ్చే ముందు శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందుకే ఇది గుండెపోటు వల్ల వచ్చిందన్న సంగతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని మెట్లు ఎక్కినా.. పరిగెత్తిన ఫీలింగ్ కలిగితే.. మాత్రం వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది అనారోగ్యకరమైన హృదయానికి సంకేతం కావచ్చు. గుండెపోటు మైకముతో కూడా ముడిపడి ఉంటుంది. మీ చుట్టూ వస్తువులు అస్పష్టంగా కనిపిస్తే.. మీరు వెంటనే హాస్పటల్ కు వెళ్లాలని అర్థం.
 

66

ఏమీ కాదులే అని వదిలేస్తే.. గుండెపోటుతో ఉన్నపాటుగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలాంటి ఘటనలు ఈ మధ్యన తరచుగా టీవీల్లో చూస్తూనే ఉన్నాం. మీ గుండెను చిక్కుల్లో పడేసే విధంగా ఒత్తిడి తీసుకోకండి. గుండెను ప్రశాంతంగా ఉంచండి. గుండె ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి. రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకోండి. అనవసరమైన  ఆలోచనలు చేసుడు మానేయండి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 14 క్యారెట్లతో అదిరిపోయే ట్రెండీ వెస్ట్రన్ చెవిపోగులు
Recommended image2
Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు
Recommended image3
Silver Jewelry: ఈసారి పెళ్లిళ్లలో ఇలాంటి వెండి నగలతో మెరిసిపోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved