Chanakya Niti : మగవాళ్లు ఆడవారిని అవమానించడానికి, విమర్శించడానికి అసలు కారణం ఇదే
Chanakya Niti : కాలం మారుతున్నా, టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్నా.. మనుషుల ఆలోచనా ధోరణి మాత్రం మారని ఆచార్య చాణక్యుడు తన నీతిలో చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం.. విజయవంతమైన మహిళలను చూసి పురుషులు అసూయ పడతారు.

చాణక్య నీతి
చాణక్య నీతి ప్రకారం.. ఈ సమాజంలో పురుషులు తమను తాము ఎంతో గొప్పవారుగా భావిస్తారు. ఆడవాళ్లకంటే ఎప్పుడూ గొప్పవారుగానే భావిస్తారు. ఆడవాళ్లు మగవారిని ఓడించినా, వారి కంటే ఎదిగినా పురుషుల అహం దెబ్బతింటుంది. వీరు తమ అహాన్ని కాపాడుకోవడానికి స్త్రీలను అవమానించడానికి, వారిని కించపర్చడానికి, హేలన చేయడానికి అస్సలు వెనకాడడు.
పురుషుల నిజ స్వరూపం
ఒకప్పుడే కాదు.. ఇప్పుడు కూడా ఇది పురుషాధిక్య సమాజమే. నేటి కాలంలో కూడా పితృస్వామ్యం కొనసాగుతోంది. దీనివల్లే పురుషులు స్త్రీలను ప్రశ్నించడం, అవమానించడం ఇంకా చేస్తున్నారు.
చాణక్య నీతి ప్రకారం..
ఓటమిపాలైన పురుషులు తమ ఓటమిని అంగీకరించకుండా ఆడవారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తారు. అలాగే పురుషులు తమ బలహీనతల్ని దాచుకుంటారు. ఇది ఇల్లు, పని, గేమ్స్, రాజకీయాలు ఇలా ప్రతిచోటా కనిపిస్తుంది.
చాణక్య నీతి ప్రకారం..
చాణక్య నీతి ఎప్పటిదో అయినా.. ఇది నేటికీ మనకు ఉపయోగపడుతోంది. దీనిలోని విషయాలు మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. చాణక్య నీతి ప్రకారం.. స్త్రీల విజయాన్ని గర్వించకుండా.. వారిపై దాడి చేయడం పురుషుల బలహీనతల్ని చూపుతుంది.