పసుపు vs శెనగపిండి.. ఏ ఫేస్ ప్యాక్ పెడితే ముఖం వెంటనే మెరిసిపోతుంది
Instant Glow: పసుపును, శెనగపిండి ఫేస్ ప్యాక్ ను ముఖానికి ఎన్నో ఏండ్ల నుంచి వాడుతూ వస్తున్నారు. ఈ రెండూ మన ముఖాన్ని అందంగా చేయడానికి, మొటిమలను, మచ్చలను పోగొట్టడానికి సహాయపడతాయి. మరి ఈ రెండింటిలో ఏది మన ముఖాన్ని వెంటనే కాంతివంతంగా చేస్తుంది

పసుపు, శెనగపిండి ఫేస్ ప్యాక్
శెనగపిండి, పసుపును కేవలం వంటలకే కాదు.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగించొచ్చు. వీటిని ఎన్నో ఏండ్ల నుంచి చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. పసుపు అయినా, శెనగ పిండి అయినా ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే గుణాలు మొటిమలను, నల్ల మచ్చలను, తెల్ల మచ్చలను తగ్గించడానికి, స్కిన్ టోన్ ను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
శెనగపిండి, పసుపు చర్మంపై ఉన్న అదనపు నూనెను, దుమ్మును, ధూళిని తొలగించడానికి సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే శెనపిండి, పసుపు ఫేస్ ప్యాక్ లో ఏది పెడితే ముఖం వెంటనే కాంతివంతంగా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పసుపు, శెనగపిండి ఫేస్ ప్యాక్ మధ్య తేడా ఏంటి?
శెనగపిండి ఫేస్ ప్యాక్ ను పెట్టుకుంటే?
శెనగపిండి నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది ముఖంపై చనిపోయిన చర్మ కణాలను, అదనపు నూనెను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను పెట్టుకోవడం వల్ల చర్మం సాఫ్ట్ గా అవుతుంది. వెంటనే మెరుస్తుంది.
పసుపు ఫేస్ ప్యాక్ ను పెట్టుకుంటే?
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను, మొటిమల వల్ల అయిన నల్ల మచ్చలను, ఫేస్ డల్ నెస్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు పసుపు ఫేస్ ప్యాక్ వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఫేస్ రీఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాదు ఇది చర్మ రంగును కాంతివంతంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ఇది పెళ్లికూతుర్లకు బాగా సహాయపడుతుంది. దీన్ని ముందు రోజు పెట్టుకుంటే పెళ్లినాడు కాంతివంతంగా కనిపిస్తారు.
పసుపు vs శెనగపిండి ఫేస్ మాస్క్.. ఏది వెంటనే గ్లో ఇస్తుంది
చర్మాన్ని వెంటనే కాంతివంతంగా చేసే విషయానికి వస్తే.. శెనపిండి బెస్ట్ అని చెప్పాలి. శెనగపిండి ఫేస్ మాస్క్ ను వాడటం వల్ల చర్మంలో అదనపు నూనెను నియంత్రిస్తుంది. అలాగే వెంటనే చర్మాన్ని మెరిసేలా చేస్తుందది. ఇది చర్మాన్ని క్లియర్ గా కనిపించేలా చేస్తుంది. మీ ముఖాన్ని తాజాగా కనించేలా చేస్తుంది. అలాగే ఇది మీ చర్మ రంగును మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది.
అదే పసుపు అయితే దీన్ని రోజూ వాడుతుంటే కొన్ని రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. పసుపు ఫేస్ ప్యాక్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండింటిలో శెనగపిండే ముఖాన్ని వెంటనే కాంతివంతంగా చేసేందుకు సహాయపడుతుంది. అయితే మీ చర్మం దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా, మంచి రంగులో కనిపించాలంటే మాత్రం పసుపును వాడటం మంచిది.