MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 5 రకాల వ్యక్తులను ఇంటికి అస్సలే రానివ్వకూడదు!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 5 రకాల వ్యక్తులను ఇంటికి అస్సలే రానివ్వకూడదు!

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మన ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తి మనకు మేలు చేస్తాడని లేదు. కొందరు మనతో నవ్వుతూ మాట్లాడుతూనే వెనుక నుంచి నష్టాన్ని కలిగించవచ్చు. అలా ఇంటి ప్రశాంతతకు ముప్పుగా మారే 5 రకాల వ్యక్తులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 13 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎలాంటి వారిని ఇంటికి రానివ్వకూడదు?
Image Credit : Gemini

ఎలాంటి వారిని ఇంటికి రానివ్వకూడదు?

ఇల్లు అంటే నాలుగు గోడలు మాత్రమే కాదు.. మన ప్రశాంతత, భద్రత, కుటుంబ బంధాలు ఉండే అందమైన ప్రదేశం. అందుకే ఇంటికి ఎవరిని ఆహ్వానిస్తున్నాం, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాం అనే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఎలాంటి వారితో సన్నిహితంగా ఉండాలి? ఎలాంటి వారి వల్ల నష్టం కలగవచ్చనే విషయాలపై అనేక సూచనలు కనిపిస్తాయి. మరి ఎలాంటి వారిని ఇంటికి అస్సలు రానివ్వకూడదో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మోసం చేసే స్వభావం ఉన్న వ్యక్తులు
Image Credit : Gemini

మోసం చేసే స్వభావం ఉన్న వ్యక్తులు

బయటకు ఎంతో మంచివారిలా కనిపిస్తూ, అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గరవుతూ, అవకాశం దొరికితే మనకు నష్టం కలిగించే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్య నీతి సూచిస్తోంది. ముఖ్యంగా మన వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను ఇలాంటి వారి ముందు చర్చించడం సమస్యలకు దారితీయవచ్చు.

Related Articles

Related image1
Interesting Facts: మనకు గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? ఆ టైంలో శరీరంలో ఏం జరుగుతుంది?
Related image2
Psychology: సైకాలజీ ప్రకారం ఏ పని చేయాలి అనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
36
ఇతరులకు హాని చేసే స్వభావం ఉన్నవారు
Image Credit : Gemini

ఇతరులకు హాని చేసే స్వభావం ఉన్నవారు

మాటలతోనైనా, చేతలతోనైనా ఇతరులను బాధపెట్టడం అలవాటుగా ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం ఇంటి ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. ఎప్పుడూ గొడవలకు దిగడం, ఇతరులను అవమానించడం, చిన్న విషయాలను పెద్దవిగా మార్చడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఇంట్లోకి వచ్చే వ్యక్తి వల్ల కుటుంబ సభ్యుల్లో భయం లేదా అసౌకర్యం ఏర్పడుతున్నట్లయితే వారిని దూరంగా పెట్టడం మంచిదని చాణక్య నీతి గుర్తు చేస్తోంది.

46
అబద్ధాలతో జీవించే వ్యక్తులు
Image Credit : Gemini

అబద్ధాలతో జీవించే వ్యక్తులు

నమ్మకాన్ని ఉపయోగించుకుని ఇతరుల నుంచి డబ్బు లేదా ప్రయోజనాలు పొందేవారితో దూరంగా ఉండటం మంచిది. చాణక్య నీతిలో నమ్మకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా మన బలహీనతలు, కుటుంబ పరిస్థితులు తెలిసిన వ్యక్తి వాటిని మనకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి తరచూ వచ్చే వ్యక్తి మన వ్యక్తిగత విషయాలను బయటకు చెబుతున్నాడా? మన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడా? అనే విషయాన్ని గమనించాలి.

56
చెడు అలవాట్లను ప్రోత్సహించే వ్యక్తులు
Image Credit : Gemini

చెడు అలవాట్లను ప్రోత్సహించే వ్యక్తులు

మన చుట్టూ ఉన్నవారి ప్రభావం మన ప్రవర్తనపై కూడా పడుతుంది. ముఖ్యంగా చెడు అలవాట్లను సాధారణమైనవిగా చూపించే వ్యక్తులతో ఎక్కువ సన్నిహితంగా ఉండటం కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇతరులను తప్పుదారి పట్టించడం, బాధ్యతారాహిత్యాన్ని ప్రోత్సహించడం, అనైతిక పనులను సమర్థించడం వంటి ప్రవర్తనలు ఉన్నవారితో హద్దులు పెట్టుకోవడం మంచిది.

66
ఎప్పుడూ గొడవలు తీసుకొచ్చే వ్యక్తులు
Image Credit : Asianet News

ఎప్పుడూ గొడవలు తీసుకొచ్చే వ్యక్తులు

ప్రతి విషయాన్నీ వివాదంగా మార్చేవారు, ఇతరుల మధ్య అపార్థాలు సృష్టించేవారు, ఇంట్లోని చిన్న విషయాలను కూడా బయటకు తీసుకెళ్లేవారు కుటుంబ ప్రశాంతతకు సమస్యగా మారవచ్చు. అలాగనీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరినీ అనుమానించాల్సిన అవసరం లేదు కానీ.. ఒక వ్యక్తి వల్ల పదేపదే గొడవలు లేదా సమస్యలు వస్తున్నట్లయితే ఆ సంబంధంలో అవసరమైన హద్దులు పెట్టుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Interesting Facts: మనకు గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? ఆ టైంలో శరీరంలో ఏం జరుగుతుంది?
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం ఏ పని చేయాలి అనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved