Telugu

రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసా?

Telugu

సహజ మాయిశ్చరైజర్

అలోవెరా జెల్ చర్మంలోకి లోతుగా వెళ్లి తేమను అందిస్తుంది. ఇది చర్మంలో సులభంగా ఇంకిపోతుంది. జిడ్డు లేకుండా ఎక్కువసేపు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.

Image credits: social media
Telugu

మొటిమల సమస్యకు చెక్

పదేపదే మొటిమలు వస్తుంటే, అలోవెరా జెల్ బెస్ట్ మెడిసిన్. దీనిలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. 

Image credits: Getty
Telugu

మంట నుంచి రక్షణ

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం కందిపోయినా, ముఖంపై మంటగా అనిపించినా అలోవెరా రాసుకోవడం మంచిది. ఇది దెబ్బతిన్న చర్మాన్ని చల్లబరుస్తుంది. ఎరుపు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

పొడి చర్మానికి బెస్ట్

మీ చర్మం మరీ పొడిగా ఉంటే, అలోవెరా జెల్‌లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖంపై మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పొడి చర్మం సమస్య తగ్గిపోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.

Image credits: Getty
Telugu

ఇది తప్పనిసరి

అలోవెరా జెల్ ని ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత, పలుచని పొరగా అలోవెరా జెల్‌ను అప్లై చేయాలి. కొత్తగా ట్రై చేసేవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

Image credits: Getty

Jhumka Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జుంకా డిజైన్లు

Silver Anklets: డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి!

రోజూ జీలకర్ర టీ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

Coriander Leaves: వంటల్లో కొత్తిమీర ఎందుకు వేయాలో తెలుసా?