MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ సెలబ్రెటీల చీట్ మీల్ ఏంటో తెలుసా..?

ఈ సెలబ్రెటీల చీట్ మీల్ ఏంటో తెలుసా..?

ఎప్పటికీ ఏమీ తినకుండా ఉండలేరు కదా.. అందుకే వారానికో, నెలకో ఒకసారి చీట్ మీల్ పెట్టుకుంటారు. మరి.. ఆ చీట్ మీల్ లో.. మీ అభిమాన సెలబ్రెటీలు ఏమి తింటారో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 14 2022, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మనమంతా మనకు నచ్చిన ఆహారం.. నచ్చినప్పుడు లాగించేస్తూ ఉంటాం. కానీ సెలబ్రెటీలు అలా కాదు.. తమ ఆరోగ్యం, అందం, ఫిట్నెస్ కాపాడుకొనేందుకు దాదాపు నిత్యం నోరు కట్టేసుకుంటూ ఉంటారు. ఇష్టమైనవి కళ్ల ముందు ఉన్నా తినలేరు. అయితే.. ఎప్పటికీ ఏమీ తినకుండా ఉండలేరు కదా.. అందుకే వారానికో, నెలకో ఒకసారి చీట్ మీల్ పెట్టుకుంటారు. మరి.. ఆ చీట్ మీల్ లో.. మీ అభిమాన సెలబ్రెటీలు ఏమి తింటారో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

1.టైగర్ ష్రాఫ్..
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాప్ అందరికీ పరిచయమే. ఆయన ఫిట్నెస్ కి, బాడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే.. ఆయన తన చీట్ మీల్ రోజున మాత్రం ఐస్ క్రీమ్ తింటారట. ఆయనకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమట.
 

310

2.దీపికా పదుకొణె...
బాలీవుడ్ దివా దీపికా పదుకొణె కూడా తన ఫిట్నెస్, అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే... ఆమె ప్రతిరోజూ డైట్ ఫాలో అయినప్పటికీ.. చీట్ డే రోజు మాత్రం తనకు ఇష్టమైన ఆహారాన్ని లాగించేస్తారట. ఆమె తన చీట్ మీల్ లో.. చాక్లెట్ కేక్స్, బ్రౌనీలు, వెనీలా ఐస్ క్రీమ్ లను తింటారట.

410

3.రణవీర్ సింగ్..
ఇక రణవీర్ సింగ్ తన చీట్ డే రోజు న్యూట్రిల్లా చాక్లెట్ సిరప్ లను తీసుకుంటారట. ఇది తప్ప.. ఆయన మరేమీ చీట్ మీల్ రోజు కోరుకోరట. చీట్ మీల్ రోజు మాత్రం న్యూట్రిల్లా తీసుకుంటారట.

510

4.అలియా భట్..
పాన్ ఇండియా హీరోయిన్ అలియా భట్ కూడా తన చీట్ డే ఫాలో అవుతారట. చీట్ మీల్ రోజు ఆమె తనకు ఇష్టమైన  ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారట. ఆమెకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే విపరీతంగా ఇష్టమట. ఈ విషయాన్ని ఓసారి ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా తెలియజేశారు.

610

5.హృతిక్ రోషన్..
కపిల్ శర్మ షో కి ఓసారి వచ్చిన హృతిక్ రోషన్.. తన చీట్ మీల్ గురించి ఫ్యాన్స్ కి తెలియజేశారు. హృతిక్ కి సమోసా అంటే చాలా ఇష్టమట. చీట్ మీల్ రోజు వాటిని లాగించేస్తారట. ఒకేసారి 8 సమోసాలను అయినా ఆయన తినగలరట.

710

6.ప్రియాంక చోప్రా..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం చీట్ మీల్ ఫాలో అవుతారట. ఆమెకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమట. అందుకే ఆమె తన చీట్ మీల్ లో స్వీట్స్ తీసుకుంటారట. అందులోనూ ఎక్కువగా ఆమె డోనట్స్ తినడానికి ఇష్టపడతారు.
 

810

7.వరుణ్ ధావన్..
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్.. తన చీట్ డే రోజున చీజ్ కేక్ తినడానికి ఇష్టపడతారు. లేదంటే జ్యూసీ బర్గర్  తింటారట. డైట్ కి చిన్న పాటి బ్రేక్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన వీటిని తీసుకుంటారట.

910

8.కరీనా కపూర్..
సినీ ఇండస్ట్రీలో జీరో సైజ్ పరిచయం చేసిన నటి కరీనా కపూర్. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా.. ఆమె మళ్లీ తన సైజ్ జోరోకి చేరుకొని అందరినీ ఆకట్టుకున్నారు. అయితే.. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఆమె మంచి ఫుడ్డీ అట. ఆమె తన చీట్ డే రోజు బిర్యానీ, పిజ్జా, పరాటా, చాక్లెట్ కేక్ లను ఇష్టంగా లాగించేస్తారట.

1010
shilpa shetty Image

shilpa shetty Image

9.శిల్పా శెట్టి..
శిల్పా శెట్టి.. తన ఫిట్నెస్, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే ఆమె చీట్ డే రోజున అంటే ఆదివారం రోజున స్వీట్స్ తింటారట. అది కూడా జిలేబీ, వఫెల్స్, ఐస్ క్రీమ్ కేక్ లను తీసుకుంటారట.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Women psychology: పదేళ్ల క్రితం జరిగిన గొడవైనా ఆడవాళ్లకు ఎలా గుర్తుంటుంది..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved