Kidney Failure: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి..
Kidney Failure: మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో మూత్ర పిండాలు ఒకటి. అయితే వీటిని ఆరోగ్యంగా ఉంచుకునే విషయంలో ఈ తప్పులను ఎట్టి పరిస్థితిలో చేయకూడదు.

మన శరీరంలో మూత్రపిండాల పాత్ర కీలకమైంది. ఇవి శరీర ద్రవాలను ఫిల్టర్ చేసి వ్యర్థాలను బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలా మంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటీస్, గుండె జబ్బుల కారణంగా మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి.
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే తగిన పోషకాహారంతో పాటుగా శరీరానికి అవసరమయ్యే నీటి మొత్తాన్ని కూడా తాగుతూ ఉండాలి. నీళ్లు మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరక శ్రమను ఖచ్చితంగా చేయాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నపాటి వ్యాయామాలను చేయండి.
మూత్రపిండాలను హెల్తీగా ఉంచాలంటే ముందుగా మీరు చేయాల్సింది రక్తపోటును నియంత్రణలో ఉంచడం. ఎందుకంటే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మూత్రపిండాల ఫెయిల్యూర్ కు కారణమవుతుంది.
ఇక డయాబెటీస్ పేషెంట్లు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే మూత్రపిండాలు దెబ్బతింటాయి.
ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యం బేషుగ్గా.. ఎలాంటి రోగాలు రాకుండా ఉంటుంది. లేదంటే సర్వరోగాలు మీకే చుట్టుకునే ప్రమాదముంది.
kidney
నీళ్లను తక్కువ తాగినా.. ఎక్కువ తాగినా ప్రమాదమే. ఈ రెండు మూత్రపిండాలు ద్రవాలను ఫిల్టర్ చేయడాన్ని కష్టతరం చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది శరీర బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి.
ఉప్పును మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే రక్తపోటు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. బీపీ పెరిగితే మూత్రపిండాల ఫెయిల్యూర్ కు కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 5 నుంచి 6 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలి.
సిగరెట్లు, ఆల్కహాల్, బీడీలు వంటి జోలికి వెల్లకూడదు. అలాగే పాడై పోయిన ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. కొన్ని రకాల మెడిసిన్స్ కూడా మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అందుకే మెడిసిన్స్ ను డాక్టర్ సలహామేరకే ఉపయోగించండి.