Anger: చిన్న విషయానికి కోపం వస్తుందా? ఈ ట్రిక్‍తో క్షణంలో మాయం
life Apr 20 2026
Author: Nandini Arava Image Credits:Freepik
Telugu
ఆఫీసులో కోపాన్ని కంట్రోల్ చేయడానికి 6 సింపుల్ టిప్స్!
ఆఫీసులో పని ఒత్తిడి, బాస్ అరవడం, ఆఫీస్ టెన్సన్స్..ఇలా ఇతర కారణాల వల్ల కోపం రావడం సాధారణమే. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ చిట్కాలు చూద్దాం.
Image credits: Getty
Telugu
డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి
కోపం వచ్చినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే రియాక్ట్ అవ్వకుండా, కళ్లు మూసుకుని నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోండి. ఇది మీ నరాలను శాంతపరిచి, టెన్షన్‌ను తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
చిన్న బ్రేక్ తీసుకోండి
కోపం వస్తున్నప్పుడు అక్కడి నుంచి కాసేపు దూరంగా వెళ్లడం మంచిది. కొంచెం నీళ్లు తాగడం లేదా చిన్న వాక్‌కి వెళ్లడం వల్ల మీ మూడ్ మారుతుంది. ప్రశాంతంగా ఉండటానికి ఇది ఒక సింపుల్ టెక్నిక్.
Image credits: Getty
Telugu
పాజిటివ్‌గా మాట్లాడుకోండి
కోపంలో ఉన్నప్పుడు మీకు మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోండి. ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. ఇలా పాజిటివ్‌గా మిమ్మల్ని మీరే మార్చుకుంటే మీ థింకింగ్ ప్రాసెస్ మెల్లగా మారుతుంది.
Image credits: Getty
Telugu
కమ్యూనికేషన్ చాలా ముఖ్యం
కోపంలో అరవకుండా, మీ మనసులో మాటను ప్రశాంతంగా చెప్పండి. ఎదుటివారిని తిట్టే బదులు, వారి పని వల్ల మీరు ఎలా ఇబ్బంది పడ్డారో మర్యాదగా వివరింంచండి.
Image credits: Getty
Telugu
సపోర్ట్ తీసుకోండి
కోపాన్ని మీలోనే దాచుకోవద్దు. మీకు నమ్మకమైన స్నేహితుడితో లేదా పై అధికారితో పంచుకోండి. వాళ్లు మీ సమస్యను పరిష్కరించడానికి, సరైన మార్గం చూపించడానికి తప్పకుండా సహాయం చేస్తారు.
Image credits: Getty
Telugu
మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండండి
గడిచిపోయిన చేదు అనుభవాలు, భవిష్యత్తు గురించిన ఆందోళనలు పక్కనపెట్టి, ప్రస్తుతం చేస్తున్న పనిపైనే దృష్టి పెట్టండి. ఇది కోపాన్ని తగ్గిస్తుంది. దీనికి ధ్యానం, యోగా బాగా ఉపయోగపడతాయి.