MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కాళ్లు, చేతులు, కీళ్లలో నొప్పి ఉందా..? అయితే మీ శరీరంలో ఇది లోపించిందేమో చూసుకోండి..

కాళ్లు, చేతులు, కీళ్లలో నొప్పి ఉందా..? అయితే మీ శరీరంలో ఇది లోపించిందేమో చూసుకోండి..

శరీరంలో కాల్షియం లోపిస్తే.. కాళ్లు, చేతులు, కీళ్లలో నొప్పి పుట్టడం మొదలవుతుంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2022, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మానవ శరీర అభివృద్ధిలో కాల్షియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  మీకు తెలుసా 70 శాతం ఎముకలు కాల్షియం, ఫాస్ఫేట్ తోనే తయారవుతాయి. కాబట్టి ఎముకలను బలంగా ఉంచుకోవడానికి కాల్షియాన్ని పుష్కలంగా తీసుకోవాలి. ఈ కాల్షియం జుట్టు, గోళ్ళ పోషణకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది బలహీనమైన ఎముకలతో బాధపడుతున్నారు. ఎంతో మంది తీసుకునే ఆహారంలో కాల్షియం లేకపోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీంతో శరీరంలో అక్కడక్కడ నొప్పి పెడుతుంది. ఈ సమస్యలన్నీ పోవాలంటే కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాలను తప్పకుండా తినాలి. 

27

కాల్షియం లోపిస్తే వచ్చే సమస్యలు

కండరాల నొప్పి

మన శరీరంలో కాల్షియం లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి. వీటిలో ముఖ్యమైనది కండరాల తిమ్మిరి. ఇది కాల్షియం లోపం ప్రారంభ లక్షణం. దీనివల్ల మన చేతుల్లో, కాళ్ళలో నొప్పి వస్తుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా ఉదయం లేవగానే ఎముకల్లో తిమ్మిరిగా అనిపిస్తుంది. కాల్షియం లోపం వల్ల కొన్నికొన్ని సార్లు చేతులు, పాదం, కాలు, నోటి చుట్టూ కూడా తిమ్మిరి ఏర్పడుతుంది.
 

37

చర్మం, గోరు సమస్య, జుట్టు రాలడం

క్యాల్షియం చర్మం, గోళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కాల్షియం లోపిస్తే చర్మం పొడిబారుతుంది. అంతేకాదు చర్మంపై గీతలు కూడా ఏర్పడుతాయి. దీనికి తోడు చర్మం ఉబ్బడం ప్రారంభిస్తుంది. గోళ్ల ఎదుగుదల ఆగిపోతుంది. అలాగే తెల్లగా మారతాయి. ఇక దంతాలల్లో కూడా సమస్యలు ఏర్పడతాయి. కాల్షియం లోపం వల్ల చిగుళ్ళ నొప్పి, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి. వీటితో పాటుగా జుట్టు కూడా విపరీతంగా ఊడిపోవడం మొదలవుతుంది. 

47
calcium

calcium

కాల్షియం లోపానికి నివారణలు

కాల్షియం లోపం పోవాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. వీటిలో ముఖ్యమైనది సోయాబీన్. సోయా ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఆకు కూరల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందుకోసం బచ్చలికూర, క్యాబేజీ, పాలకూర మొదలైన వాటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. ఈ కూరగాయలు ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. దంతాలను బలోపేతం కూడా చేస్తాయి. 

57
calcium

calcium

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్ తో పాటుగా కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే గుడ్లను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. ఈ ఆహారాలు ఇవి ఎముకలను గట్టిపరచడానికి ఉపయోగపడతాయి. గుడ్లలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే మీ ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. 

67

కొన్ని రకాల పండ్లలో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇందుకోసం నారింజ, పైనాపిల్, అరటి, అవకాడో, కివి, అత్తి పండ్లు, ఖర్జూరాలు, మల్బరీ వంటి పండ్లను రోజూ కొన్ని తినండి. 

77

శరీరంలో కాల్షియం లోపాన్ని పోగొట్టడానికి కృత్రిమ సప్లిమెంట్లను తీసుకునే బదులు.. అవసరమైనంత వరకు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలనే తినడం మంచిది. ఇవి ఇతర ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: పరగడుపున రోజూ ఇవి తింటే.. బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
మహిళలు ప్రతి ఏడాది ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్
Recommended image3
Flax Seeds: చలికాలంలో అవిసె గింజలు తినొచ్చా? తింటే ఏమవుతుంది? ఎవ్వరు తినకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved