MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలన్నా.. షార్ప్ గా పనిచేయాలన్నా ఈ పోషకాలు అవసరం..

మీ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలన్నా.. షార్ప్ గా పనిచేయాలన్నా ఈ పోషకాలు అవసరం..

మెదడు ఆధీనంలోనే మన మొత్తం శరీరం పనిచేస్తుంది. అందుకే బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బ్రెయిన్ ఆరోగ్యం గనుక దెబ్బతింటే మీరు ఏ పనులు సక్రమంగా చేయలేరు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 17 2022, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image: Getty Images

Image: Getty Images

మన శరీర పనితీరు మొత్తం మన బ్రెయిన్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ పనితీరు క్షీణిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం మెదడు ఆరోగ్యం దెబ్బతినడం. అయితే మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని పనులు చేస్తే సరిపోతుంది. అందులో ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలను ఖచ్చితంగా తినాలి. పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడే ముఖ్యమైన పోషకాల గురించి ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు

ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అభ్యసన సామర్థ్యాన్ని,  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. ఇవి సాల్మన్ వంటి సీ ఫుడ్, అవొకాడో, ఆలివ్ ఆయిల్, వాల్ నట్స్, గుడ్లు, రెడ్ మీట్, పొద్దుతిరుగుడు నూనె, గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉంటుంది. 
 

36

ఇనుము

ఇనుము మెదడుకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. అభిజ్ఞా అభివృద్ధి, DNA సంశ్లేషణ, మైటోకాన్డ్రియల్ శ్వాసక్రియ, మైలిన్ సంశ్లేషణ, న్యూరోట్రాన్స్మిటర్ సంశ్లేషణ, జీవక్రియ వంటి మెదడు పనితీరులో ఇది సహాయపడుతుంది. అందుకే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను పుష్కలంగా తినండి. పాలకూర, చిక్కుళ్లు, గుమ్మడి గింజలు, గుడ్లు, డార్క్ చాక్లెట్స్, ఎండుద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. 
 

46

విటమిన్ డి

ఎముకల ఎదుగుదలకు, ఎముకలు, దంతాల బలానికి విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ మెదడుకు కూడా చాలా అవసరం. నిజానికి ఈ విటమిన్ వృద్ధులలో చిత్తవైకల్యం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఈ విటమిన్ డి సూర్యరశ్మి, గుడ్డులోని పచ్చసొన, చేపలు, పుట్టగొడుగులు, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమలు, రాగులు, ఓట్స్, బాదం పాలు, సోయా పాలలో విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

 

56

మెగ్నీషియం

మన శరీరానికి మెగ్నీషియం చాలా అవసరం. ఒంట్లో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే మైగ్రేన్ నొప్పి, నిరాశ, అనేక నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు తినే ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉండేట్టు చూసుకోండి. మొలకలు, బ్రోకలీ, ఆకు కూరలు, గ్రీన్ బఠాణీలు, క్యాబేజీ, అరటిపండ్లు, గుమ్మడి గింజలు, బాదం పప్పులు, డార్క్ చాక్లెట్ లో మెగ్నీషియం బాగా ఉంటుంది. 
 

66

సెలీనియం

సెలీనియం మన మెదడుకు యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ జీవక్రియ, డిఎన్ఎ సంశ్లేషణ, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సెలీనియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సెలీనియం చేపలు, గింజలు, విత్తనాలు, మాంసం, బ్రౌన్ రైస్, పాల ఉత్పత్తులు, గుడ్లు, పుట్టగొడుగులు, ఓట్ మీల్ , కాయ ధాన్యాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Travel Tips: కారు, బస్సు ప్రయాణం పడడం లేదా? వాంతులు అవుతుంటే ఈ చిన్న పని చేయండి
Recommended image2
Mangalsutra Bracelet: నేటి మగువల మనసు దోచే మంగళసూత్ర బ్రేస్‌లెట్స్
Recommended image3
Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved