Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • బ్లూబెర్రీల నుంచి పుచ్చకాయ వరకు.. ఈ ఫుడ్స్ డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయి

బ్లూబెర్రీల నుంచి పుచ్చకాయ వరకు.. ఈ ఫుడ్స్ డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తాయి

ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు డార్క్ సర్కిల్స్ ను కలిగిస్తాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఈ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి.   

Mahesh Rajamoni | Published : Jun 10 2023, 01:29 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

కళ్ల కింద నల్లటి వలయాలు ముఖ అందాన్ని తగ్గిస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ జన్యుపరంగా కూడా వస్తాయి. అలాగే చర్మంలో కొల్లాజెన్ తగ్గినప్పుడు కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి కొల్లాజెన్ ను విచ్ఛిన్నం చేయడం వల్ల చర్మం రంగు మారుతుంది. కాలానుగుణ అలెర్జీలు శరీరంలో హిస్టామిన్ల విడుదలను కూడా ప్రేరేపిస్తాయి. ఇది రక్త నాళాల వాపునకు కారణమవుతుంది. నల్లటి వలయాలు తగ్గిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

26
Asianet Image

విటమిన్ సి

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఆహారాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణ, కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జామ, స్ట్రాబెర్రీ, నారింజ, కాలీఫ్లవర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 
 

36
Asianet Image

లైకోపీన్

లైకోపీన్ ఎన్నో పండ్లు, కూరగాయలలో కనిపించే అత్యంత శక్తివంతమైన రసాయనం. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యం, మొత్తం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుది. ఇది పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. టమోటాలు, పుచ్చకాయ, క్యాబేజీ, బొప్పాయిలో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది.

46
vitamin k

vitamin k

విటమిన్ కె

విటమిన్ కె కూడా డార్క్ సర్కిల్స్ ను దూరం చేస్తుంది. ఇది దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి, చర్మ గాయాలను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ విటమిన్ కె తినడం వల్ల మీ డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి. టర్నిప్ ఆకుకూరలు, కాలీఫ్లవర్, దానిమ్మ, టమోటాల్లో విటమిన్ కె పుష్కలంగా  ఉంటుంది. 

56
Asianet Image

ఇనుము

మీరు తినే ఆహారంలో సోయా బీన్స్, ఎర్ర మాంసం, చియా విత్తనాలు, ఎండిన నేరేడు పండ్లు, బచ్చలికూర వంటి ఆహారాల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. శరీర కణజాలంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. అలాగే  కంటి కింద వలయాలను తగ్గిస్తుంది. 
 

66
Asianet Image

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో ఉండే సెరోటోనిన్ నిద్ర లేమి, అలసటతో పోరాడటానికి సహాయపడుతుంది. 
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories