Health Tips: నల్ల పసుపు ఔషధాల గని.. దీంతో ఎన్ని జబ్బులు తగ్గుతాయో తెలుసా..?
Health Tips: పసుపు రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు ఎన్నో వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే దీనిని ప్రతిరోజూ చిన్న మొత్తంలో తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎన్నో రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి. అందుకే దీన్ని ప్రతి వంటలో వేస్తుంటారు. ఇక మనం వంటల్లో ఎల్లో కలర్ పసుపునే వాడుతాం. అయితే పసుపు నలుపు రంగులో కూడా లభిస్తుంది. దీనిని నల్ల పసుపు అని పిలిచినప్పటికీ.. ఇది నలుపు, నీలం రంగుల కలయికతో ఉంటుంది.
Black Turmeric
నల్ల పసుపు సాధారణంగా భారతదేశం, మధ్యప్రదేశ్ లోని ఈశాన్యంలో బాగా పండిస్తారు. నల్ల పసుపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కార్కుమా సెసియా (Corkuma cesia). మణిపూర్, కొన్ని ఇతర రాష్ట్రాలలోని గిరిజనులలో ఈ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ పాములు, తేళ్ల గాయాలకు, కాటుపై ఈ నల్ల పసుపు చెట్టు వేర్ల నుంచి తయారు చేసిన పేస్ట్ ను పూస్తారు.
నల్ల పసుపులో ఏయే ఔషధ గుణాలు ఉంటాయి
ఒక అధ్యయనం ప్రకారం. నల్ల పసుపు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది ఆయుర్వేదం యొక్క ఉత్తమ మూలికలలో ఒకటి. దీనిలో వివిధ రకాల ఔషధ గుణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి యాంటీ ఫంగల్, యాంటీ-ఆస్తమా, యాంటీ ఆక్సిడెంట్, అనాల్జేసిక్, లోకోమోటర్ డిప్రెసెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉంటాయి. ఇవి కండరాల విశ్రాంతి, ఆందోళన, సిఎన్ఎస్ డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇది మీ శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది.
protect-lungs
ఊపిరితిత్తులు వ్యాధి నుంచి విముక్తి:
నల్ల పసుపు శ్వాసకోశ వ్యాధులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి, జలుబు, జలుబు, దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు దీనిని పసుపుగా వంటల్లో ఉపయోగించవచ్చు.
migraine
మైగ్రేన్ కు రెమెడీ
మైగ్రేన్ సమస్య చాలా మంది మహిళల్లో కనిపించినప్పటికీ.. ఈ వ్యాధి ఏ సమయంలోనైనా ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. ఇది తల వెనుక భాగంలో, ఒక సైడ్ తల మొత్తం భరించలేని నొప్పిని కలిగిస్తుంది. మైగ్రేన్ తో బాధపడుతున్న వ్యక్తులు పెద్ద పెద్ద సౌండ్స్ ను వినలేరు. అలాగే వెలుతురులో కూడా ఉండలేరు. ఎందుకంటే ఇవి ఈ సమస్యలను మరింత పెద్దవి చేస్తాయి. అయితే ఈ సమస్యను వదిలించుకోవడానికి నల్ల పసుపు ఎంతో సహాయపడుతుంది. ఉపశమనం కోసం.. తాజా పసుపును గ్రైండ్ చేసి దాని పేస్ట్ ను నుదిటిపై అప్లై చేయండి.
ఇది పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది
చాలా మంది మహిళలు తమ బహిష్టు సమయంలో పొత్తికడుపు నొప్పితో బాధపడతారు. అయితే నల్ల పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం నల్ల పసుపు పొడిని వేడి పాలలో కలిపి తాగితే మంచిది.