MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Cracked Heels: ఇదొక్కటి పెట్టినా మడమల పగుళ్లు తగ్గుతాయి

Cracked Heels: ఇదొక్కటి పెట్టినా మడమల పగుళ్లు తగ్గుతాయి

Cracked Heels: చాలా మందికి వర్షాకాలంలో మడమలు పగుళుతుంటాయి. ఇది చిన్న సమస్యే అయినా దీనివల్ల నడవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి రక్తం కూడా వస్తుంది. అందుకే వీటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 16 2025, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మడమల పగుళ్లు
Image Credit : our own

మడమల పగుళ్లు

మడమలు పగుళ్లు అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం. ఈ సమస్య ఎండకాలంలోనే కాదు వానాకాలంలో కూడా చాలా మందికి వస్తుంటుంది. దీనివల్ల పాదాలు బాగా నొప్పి ఉంటాయి. ఈ నొప్పితో నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ఈ మడమల పగుళ్లను చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
గోరువెచ్చని నీళ్లు
Image Credit : Getty

గోరువెచ్చని నీళ్లు

ఇది చాలా సింపుల్ చిట్కా. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్లు పోయండి. దీనిలో షవర్ జెల్ వేసి మీ పాదాలను అందులో 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత మీ పాదాలను రుద్ది క్లీన్ చేయండి. తర్వాత నార్మల్ వాటర్ తో కడిగి టవల్ తో తుడవండి. తర్వాత మాయిశ్చరైజర్ ను పెట్టండి. దీనివల్ల పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. 

37
తేనె
Image Credit : social media

తేనె

తేనె కూడా  పాదాల పగుళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. తేనే నేచురల్ యాంటీసెప్టిక్. కాబట్టి  ఇది పగుళ్లను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచే్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో కొంచెం తేనె కలిపి మీ పాదాలను అందులో 20 నిమిషాలు నానబెట్టండి. లేదా మీరు పడుకునే టప్పుడు నేరుగా పగుళ్లకు కూడా తేనెను అప్లై చేయొచ్చు. 

47
కొబ్బరి నూనె
Image Credit : Pinterest

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కూడా మడమల పగుళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే తేమ లక్షణాలు పగుళ్లను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి కొబ్బరి నూనె పెట్టి కాసేపు మసాజ్ చేయండి. ఇలా రోజూ చేస్తే పాదాల వాపు, నొప్పి, పగుళ్లు తగ్గుతాయి. అలాగే పాదాల చర్మం స్మూత్ గా అవుతుంది.

57
అరటిపండు, వెన్న
Image Credit : Getty

అరటిపండు, వెన్న

అరటిపండు, వెన్నతో మడమల పగుళ్లను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బాగా పండిన అరటిపండులో వెన్న వేసి పేస్ట్ చేయండి. దీన్ని శుభ్రంగా కడిగిన పాదాలకు పట్టించి కొద్దిసేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. 

67
వ్యాసెలిన్, నిమ్మరసం
Image Credit : Getty

వ్యాసెలిన్, నిమ్మరసం

మడమల పగుళ్లను నిమ్మరసం, వాసెలిన్ తో కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వాసెలిన్ లో నిమ్మరసం కలిపి రాత్రిపూట నిద్రపోయే ముందు మడమలకు పెట్టండి. మరుసటి రోజు గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. నిమ్మలోని ఆమ్ల గుణాలు చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. వాసెలిన్ పాదాల చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.

77
ఓట్స్
Image Credit : Getty

ఓట్స్

ఓట్స్ మడమల పగుళ్లను తగ్గించుకోవడానికి మంచి స్క్రబ్ లాగ పనిచేస్తుంది. ఇందుకోసం టీ స్పూన్ ఓట్స్ పొడిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ చేయండి. దీన్ని మడమలకు పట్టించి కాసేపు మసాజ్ చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడగండి. ఇది మడమలను తగ్గించి చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
సౌందర్యం
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఉప్పు డబ్బాలో వీటిని వేస్తే గడ్డ కట్టదు, చెమ్మపట్టదు
Recommended image2
Fashion Tips: ఈ వర్షాకాలంలో ఉన్న వాతావరణానికి ఏ బట్టలు వేసుకోవాలి? ఉక్కపోత తగ్గించే బెస్ట్ ఫ్యాబ్రిక్స్
Recommended image3
Gardening Tips: ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!
Related Stories
Recommended image1
Gardening Mistakes: మొక్కలకు నీళ్లు పోస్తున్నా ఎండిపోతున్నాయా? అయితే ఇలా చేయండి
Recommended image2
Rice: అన్నానికి బదులు వీటిని తిన్నా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved