మీ పిల్లలకు కంటి సమస్యా? ఈ ఫుడ్స్ తో చెక్ పెట్టండి..
కంటి ఆరోగ్యం అన్నింటికంటే చాలా ముఖ్యమైనదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యేది కంటిచూపే. eyesightలో తేడా రావడానికి పోషకాహార లోపంతో పాటు అనేక కారణాలుంటాయి.
children
చిన్నారుల ఆరోగ్యం విషయంలో ప్రతీ తల్లిదండ్రలు ఎంతో శ్రద్ధ వహిస్తారు. గుండె, ఊపిరితిత్తులు.. శరీరంలోని మిగతా అవయవాల విషయంలో ఎంతో జాగ్రత్తగా గమనిస్తారు. ఎలా పనిచేస్తున్నాయి.. భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? అని బాగా గమనిస్తారు. అయితే కళ్ల విషయానికి వచ్చేసరికి కాస్త నిర్లక్ష్యం చేస్తారనే చెప్పొచ్చు.
కంటి ఆరోగ్యం అన్నింటికంటే చాలా ముఖ్యమైనదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యేది కంటిచూపే. eyesightలో తేడా రావడానికి పోషకాహార లోపంతో పాటు అనేక కారణాలుంటాయి.
childs eyesight
ముఖ్యంగా చిన్నారుల కంటి చూపు విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు రోజూ చూసే స్క్రీన్ టైం ను తగ్గించాలి. ఇవ్వాళా, రేపటి పిల్లలు ఉదయం లేస్తూనే స్మార్ట్ ఫోన్లలోనే తల దూరుస్తున్నారు. అందులో రైమ్స్ పెడితే కానీ అన్నం కూడా తినడం లేదు. నెలల చిన్నారుల నుంచి ఈ అలవాటు మొదలవుతోంది. కాబట్టి వారి screen time మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి.
కొన్ని రకాల పండ్లు, ఆహారపదార్థాలు మీ పిల్లల కంటిచూపును మెరుగు పరుస్తాయి. అలాంటి ఆహారాలను వారి daily dietలో తప్పనిసరిగా చేర్చాలి. అలాంటి కొన్ని రకాల ఫుడ్స్ గురించి తెలుసుకుంటే... కంటి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది.
green leafs
ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు....
green leafy veggiesలో విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తాయి. కాలె, స్పినాచ్ లాంటివి మీ చిన్నారుల ఆహారంలో క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. పాలకూర, kale లను వారు తినే విధంగా వండి.. తినిపిస్తే చిన్నారుల కంటి చూపు బాగుంటుంది.
బీటా కెరోటిన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం ఎక్కువగా విటమిన్ ఏ ను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అలాంటి beta-carotena ఎక్కువగా ఉండే క్యారట్లు కంటి చూపుకు ఎంతో మంచివి.
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు కూడా చిన్నారుల కంటి ఆరోగ్యానికి ఎంతో మంచివి. చిన్నారులకు కాదే omega-3 fatty acids పెద్దవారికి కూడా మంచివి. అందుకే పెద్దవారు కూడా కంటి ఆరోగ్యం కోసం చేపల్ని ఎక్కువగా తినొచ్చు.
గుడ్లు చిన్నారుల ఆరోగ్యానికి శ్రీరామరక్ష. అద్భుతమైన పోషకవిలువలతో కూడి ఉండే eggsలోని పచ్చసొనలో విటమిన్ ఎ, ల్యుటెన్, జియాంక్జంథిన్, జింక్ లు ఉంటాయి. ఇవి eye healthకి చాలా మంచిది.
ఆల్మండ్ లాంటి nuts లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. వీటివల్ల వయసుతో పాటు వచ్చే అనారోగ్యాలు ఉదాహరణకు macular degeneration, కాటారాక్ట్స్ వంటికి ప్రభావం చూపకుండా చేయగలుగుతాయి.
నిమ్మజాతి పండ్లు...
citrus fruitsలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కంటిలోని రక్త నాళాలను చక్కగా పనిచేసేలా చేయడానికి నిమ్మజాతి పండ్లు బాగా పనిచేస్తాయి. రక్త సరఫరా బాగా అయ్యేలా.. సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి.
తరచూ కడుపు నొప్పి వస్తుందా.. అయితే ఈ సహజసిద్ధమైన ఇంటి చిట్కాలు పాటించండి!