MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారా..? అయితే రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలను తినండి..

ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారా..? అయితే రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలను తినండి..

కరోనా వ్యాప్తి నుంచి ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలనే తింటున్నారు. అయితే ఈ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటేనే మనం ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడాల్సి వస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 23 2022, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కొత్త కొత్త రోగాలు ప్రజలను పట్టిపీడిస్తూనే ఉన్నాయి. కంటికి కనిపించని కరోనా వైరస్ తో ఎంతోమంది చనిపోయారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలను ఫేస్ చేస్తున్నవారున్నారు. ఈ మధ్యకాలంలో మంకీపాక్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధుల కేసులు కూడా పెరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఈ రోగాల నుంచి బయటపడటానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోగనిరోధక శక్తి మీ రోగాన్ని ట్యాబ్లెట్లు వాడకుండానే తొందరగా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని ఎలాంటి ఆహారాలు పెంచుతాయో తెలుసుకుందాం.. 

26

బెర్రీలు

సాధారణంగా పండ్ల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ ఆపిల్, నారింజ, ద్రాక్ష మొదలైన వాటినే ఎక్కువగా తింటుంటారు. కానీ మన ఆరోగ్యానికి బెర్రీలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. క్యాన్సర్ ముప్పు కూడా ఉండదు. బెర్రీలలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యానికి సహాయపడతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

36

బచ్చలికూర

బచ్చలికూరలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ కూర మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్కె, ఇనుము, ఫోలేట్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. 
 

46
garlic

garlic

వెల్లుల్లి

వెల్లుల్లిని ప్రతికూరలో వేస్తారు. వెల్లుల్లి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనిలోని పదార్ధం మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ప్రమాదకరమైన క్యాన్సర్,  గుండె జబ్బులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

56

బాదం

బాదం పపుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ పప్పులు శరీర మంటను తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాదు ఈ పప్పులు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కణాల నష్టం, వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
 

66

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తప్పుతుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: పరగడుపున రోజూ ఇవి తింటే.. బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
మహిళలు ప్రతి ఏడాది ఈ టెస్టులు చేయించుకుంటే బెటర్
Recommended image3
Flax Seeds: చలికాలంలో అవిసె గింజలు తినొచ్చా? తింటే ఏమవుతుంది? ఎవ్వరు తినకూడదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved