MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Old Socks Reuse: ఒక సాక్స్ పోయిందని.. మరో సాక్స్ పడేస్తున్నారా? ఇలా వాడేయండి..

Old Socks Reuse: ఒక సాక్స్ పోయిందని.. మరో సాక్స్ పడేస్తున్నారా? ఇలా వాడేయండి..

 Old Socks Reuse: మీవి కానీ, మీ పిల్లల స్కూల్ సాక్స్ కానీ.. ఒకటి పోయి.. మరొకటి మాత్రమే ఇంట్లో ఉందా? సింగిల్ సాక్స్ ఎలా వేసుకుంటాం అని.. దానిని పడేస్తూ ఉంటారు. కానీ, ఇంట్లో చాలా రకాలుగా వాడొచ్చని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 01 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సింగిల్ సాక్స్ పారేయకండి....
Image Credit : chat GPT

సింగిల్ సాక్స్ పారేయకండి....

ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా వినిపించే సమస్యల్లో ఇదొక్కటి. ఉతికేటప్పుడు.. రెండు సాక్సులు కలిపి ఉతికినా.. తర్వాత చూసే సరికి ఒక సాక్స్ ఎక్కడ పడిపోతుందో తెలీదు. కేవలం ఒకటి మాత్రమే దొరుకుతుంది. ఇక.. ఒక్క సాక్స్ ని వేసుకోలేక.. దానిని పారేస్తూ ఉంటారు. కానీ.. మిగిలిపోయిన సింగిల్ సాక్స్ ని ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 ఇంటిని శుభ్రం చేయడానికి..
Image Credit : Getty

ఇంటిని శుభ్రం చేయడానికి..

చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి పాత క్లాత్ వాడుతూ ఉంటారు. ఆ పాత క్లాత్ గా మనం మిగిలిపోయిన సాక్స్ ని వాడితే సరిపోతుంది. ముఖ్యంగా కిటికీలు లాంటివి శుభ్రం చేయడానికి వేరే క్లాత్ లు పెద్దగా హెల్ప్ చేయవు. కానీ.. మీరు పాత సాక్స్ ని మీ చేతికి తొడిగి.. ఆ తర్వాత.. కిటికీ సందుల్లో దూర్చి శుభ్రం చేయచ్చు. చిన్న చిన్న మూలలను శుభ్రం చేయడానికి పాత సాక్సులు వాడేయచ్చు.

హ్యాండ్ బ్యాగ్ షేప్ మారకుండా...

ఖాళీ హ్యాండ్ బ్యాగ్ కబోర్డ్స్ లో పెడితే.. దాని షేప్ మారిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ నలిగిపోతుంది. అలా జరగకుండా ఉండటానికి చాలా మంది పేపర్లు లాంటివి పెట్టి.. కబోర్డ్స్ లో పెడుతూ ఉంటారు. దానికి బదులు.. మీ ఇంట్లో మిగిలిపోయిన పాత సాక్సులను బ్యాగ్ లో కూర్చి పెట్టొచ్చు. దీని వల్ల.. హ్యాండ్ బ్యాగ్ నలిగిపోకుండా ఉంటుంది.

Related Articles

Related image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Related image2
Kids Clothes Reuse: పిల్లల బట్టలు పొట్టిగయ్యాయని పారేస్తున్నారా? ఇలా వాడేయండి
35
మంచి సువాసన వెదజల్లడానికి...
Image Credit : Getty

మంచి సువాసన వెదజల్లడానికి...

నార్మల్ గా మనం బట్టల కబోర్డ్ లో సువాసన రావడానికి మాఫ్తలిన్ బాల్స్ లాంటివి పెడుతూ ఉంటారు. వాటికి బదులు.. మీ పాత సాక్సులను బాగా శుభ్రం చేసి.. అందులో.. ఎండిపోయిన పూలరేకులు, లావెండర్, కర్పూరం లేదా కాఫీ గింజలను నింపాలి. వీటిని బట్టల కబోర్డ్స్ లో పెడితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల.. దుస్తుల నుంచి మంచి వాసన వస్తుంది.

45
మొక్కలు పెంచడానికి..
Image Credit : Chat GPT

మొక్కలు పెంచడానికి..

మీరు ఇంట్లో చిన్న చిన్న ఇండోర్ మొక్కలు పెంచడానికి కూడా పాత సాక్సులను వాడొచ్చు. సాక్సుల్లో మట్టి, కోకోపిట్ నింపి.. చిన్నపాటి మొక్కలు పెంచొచ్చు. లేదంటే.. మొక్కల కుండీలకు కూడా సాక్సులు తగిలించొచ్చు. చాలా అందంగా కనిపిస్తాయి.

మొబైల్ ఫోన్ లేదా కళ్లద్దాల కవర్...

కళ్ల జోడు కోసం.. మొబైల్ కోసం స్పెషల్ గా కొత్తగా కవర్లు కొనాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లో మిగిలిపోయిన పాత సాక్సులను వాడేయచ్చు. శుభ్రమైన, మృదువైన సాక్సులు మీ మొబైల్ ఫోన్‌లు, కళ్లద్దాలు లేదా చిన్న గాడ్జెట్‌లను గీతల నుండి కాపాడటానికి ఒక గొప్ప కవర్‌గా ఉపయోగపడతాయి. ఇది ముఖ్యంగా ప్రయాణించేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇది మీ విలువైన వస్తువులను కూడా సురక్షితంగా ఉంచుతుంది.

55
హెయిర్ కర్ల్స్..
Image Credit : amazon

హెయిర్ కర్ల్స్..

జుట్టును ఉంగరాల్లా తిప్పడానికి చాలా మంది హీట్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటిని వాడటం వల్ల జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా.. ఈ పాత సాక్సులను వాడితే సరిపోతుంది. పాత సాక్సులను రాత్రిపడుకునే ముందు.. జుట్టుకు చుట్టి.. ఉదయాన్నే.. తీస్తే.. జుట్టు ఎలాంటి డ్యామేజ్ లేకుండా అందంగా మారతాయి.

పెంపుడు జంతువు కోసం బొమ్మ...

మీ ఇంట్లో పాత సాక్స్ ఉంటే.. దానిలో కొన్ని పాత ముక్కలను కూర్చి.. ముడి వేసి మీ ఇంట్లో పెంపుడు జంతువులుకు ఇవ్వొచ్చు. దీనితో మీ పిల్లలు, కుక్కలు హ్యాపీగా ఆడుకుంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image3
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Related Stories
Recommended image1
Blouse Reuse Ideas: పాత జాకెట్లు పారేస్తున్నారా? ఇలా ఇంట్లో వాడేయండి..!
Recommended image2
Kids Clothes Reuse: పిల్లల బట్టలు పొట్టిగయ్యాయని పారేస్తున్నారా? ఇలా వాడేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved