Besan Face Packs: శెనగ పిండి ఫేస్ ప్యాక్ తో మీ అందం అదరహో..!
Besan Face Packs: శెనగపిండిని స్వీట్ల తయారీకి మాత్రమే.. అందం సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. శెనగ పిండి చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటుగా చర్మ సమస్యలను కూడా పోగొడుతుంది.

శెనగ పిండిలో చాలా పోషకాలుంటాయి. ఫైబర్, మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, కాల్షియం. విటమిన్ ఎ, పొటాషియం, రాగి, మెగ్నీషియం, సెలీనియం, ఇనుము, జింక్, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా శెనగ పిండి ముఖ అందాన్ని పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
జిడ్డు చర్మం (Oily skin)ఉన్నవారికి శెనగ పిండి ఎంతో ఉపయోగపడుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లు సబ్బుకు బదులుగా శెనగపిండితో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల కడుక్కోవడం వల్ల మీ ముఖం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఒక చెంచా శెనగపిండిలో కొద్దిగా తేనె పోసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ముఖంలో గ్లో పెరుగుతుంది. తేనెకు బదులుగా ఆవుపాలతో పేస్ట్ లా చేసి కూడా ముఖానికి అప్లై చేయొచ్చు.
శెనగపిండికి పెరుగును జోడించి ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. మీరు ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు వేసుకోవచ్చు.
శెనగపిండిలో పెరుగు, పసుపు పొడి ని వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి అది పూర్తిగా ఎండిపోయాక కడిగేయండి. మొటిమలు, డార్క్ స్పాట్స్ నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ ఫేస్ ప్యాక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ప్యాక్ ను వారానికి నాలుగైదు సార్లు అప్లై చేయవచ్చు.
శెనగ పిండిలో గుడ్డులోని తెల్లసొనను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటిలో కడిగేయాలి. పొడిబారిన చర్మం ఉన్నవారు ఈ ఫేస్ ప్యాక్ కు దూరంగా ఉండాలి.