ముఖం అందంగా మెరిసిపోవడానికి ఖరీదైన క్రీములే వాడాలా? కుంకుమ పువ్వు ఒక్కటి చాలదా..!
benefits of saffron : నలుగురిలో తామే అందంగా కనిపించాలని అమ్మాయిలు..అబ్బాయిలు మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అవిపెట్టుకుంటే కాసేపటి దాకా బాగానే అనిపించినా.. ఆ తర్వాత మీ అందమంతా కరిగిపోతుంది. కానీ కుంకుమ పువ్వు అలా కాదు..

అందంగా మారిపోతారంటే చాలు మార్కెట్ లోకి వచ్చిన ప్రతి క్రీమును ట్రై చేసే వాళ్లు చాలా మందే ఉంటారు. వీటి వాడకం వల్ల చర్మంపై దద్దుర్లు రావడం, అలెర్జీ, చర్మం రంగు దెబ్బతినడం, ముఖంపై మొటిమలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కుంకుమ పువ్వును వాడితే మాత్రం సహజ అందం మీ సొంతం అవుతుంది. ఈ ఒక్క కుంకుమ పువ్వు వాడితే చాలు మీరెన్ని క్రీములు వాడినా రాని అందం మీ సొంతం అవుతుంది. అది కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ..మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.
saffron
అయితే ఈ కుంకుమ పువ్వును గర్భిణులు మాత్రమే ఎక్కువగా తింటుంటారు. దీనికి ఒక కారణం ఉంది. గర్భిణులు కుంకుమ పువ్వును పాలల్లో వేసుకుని తాగితే కడుపులోని బిడ్డ ఎర్రగా బుర్రగా పుడతాడని నమ్ముతుంటారు. వాస్తవానికి కుంకుమ పువ్వు వల్ల కలర్ ఛేంజ్ ఏమీ కారు. కానీ ఆరోగ్యంగా మాత్రం ఉంటారు.
saffron
ఈ కుంకుమ పువ్వు ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. అందుకే దీన్ని ఎక్కువగా ఆహారాల్లో వేస్తుంటారు. ఈ కుంకుమ పువ్వు కేవలం వంటల్లోనే కాదు అందానికి మెరుగులు దిద్దేందుకు కూడా ఉపయోగపడుతుందన్న సంగతి మీకు తెలుసా? ఖరీదైన కుంకుమ పువ్వు అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
Saffron
మొటిమలను తగ్గిస్తుంది.. మొటిమల నివారణకు కుంకుమ పువ్వు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కుంకుమ పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ కాంపోనెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాలను త్వరగా నయం చేస్తాయి. కొన్ని కుంకుమ పువ్వులను తీసుకుని ఐదు లేదా ఆరు తులసి ఆకులను శుభ్రం చేసుకుని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ లను మొటిమలపై అప్లై చేయాలి.
శరీరంలో ఏ భాగంలోనైనా గోధుమ రంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్, ముఖం రంగు మారడం ,ముఖం పై నల్లని మచ్చలు ఉన్నాయా? ఈ మచ్చలన్నింటీని వదిలించడానికి కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కుంకుమ పువ్వును నీళ్లలో నానబెట్టి.. రెండు చెంచాల పసుపును వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి డార్క్ స్పాట్ లేదా పిగ్మెంటేషన్ ఏర్పడిన చోట అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు తొందరగా తొలగిపోతాయి.
మచ్చలు.. ముఖంపై లేదా చేతులు, పాదాలపై మచ్చలు ఉండటం సాధారణం. ఈ మరకలను కుంకుమ పువ్వుతో ఈజీగా తొలగించుకోవచ్చు. నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వు రేకుల్లో కొద్దిగా కొబ్బరినూనె ను వేసి దాన్ని మరకలపై అప్లై చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మచ్చలు మటుమాయం అవుతాయి.
జుట్టు ఆరోగ్యానికి.. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కుంకుమ పువ్వు జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. దీంతో జుట్టు అందంగా మెరిసిపోతుంది. ఇందుకోసం జుట్టుకు ఉపయోగించే నూనెలో కొన్ని కుంకుమ రేకులను వేసి.. జుట్టుకు అప్లై చేసి కాసేపు మర్దన చేయాలి. ఇది హెయిర్ బేస్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు ధ్రుడంగా మారుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా తొలగిపోతుంది.
కుంకుమ పువ్వును దాదాపుగా అన్ని సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఇది ముఖాన్ని ప్రకాశవంతంగా తయారుచేస్తుంది. అంతేకాదు చర్మం రంగును కూడా మార్చుతుంది. కుంకుమ పువ్వును సౌందర్య సాధనంగా మన పూర్వీకులు చాలా ఏండ్ల పాటు ఉపయోగించారు. అందుకే వారి చర్మం క్లియర్ గా కాంతివంతంగా ఉండేదట. కుంకుమ పువ్వు రేకులను చేతులతో నలిపి రసం తీయాలి. దీనికి గంధం పొడి, రోజ్ వాటర్ కలిపి ప్రతిరోజూ ముఖానికి అప్లై చేయాలి.