- Home
- Life
- kumkuma puvvu: గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వును తీసుకోమనడానికి వెనకున్నఅసలు కారణం ఇదన్నమాట..
kumkuma puvvu: గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వును తీసుకోమనడానికి వెనకున్నఅసలు కారణం ఇదన్నమాట..
kumkuma puvvu: గర్భిణులకు పాలల్లో కాసింత కుంకుమ పువ్వును వేసి ఇస్తుంటారు. ఈ కుంకుమ పువ్వు వల్ల పిల్లలు ఎర్రగా బుర్రగా పుడతారని పెద్దలూ అంటూ ఉంటారు. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. కుంకుమ పువ్వుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

kumkuma puvvu: పెళ్లైన ప్రతి మహిళ మొదటగా కోరుకునేది.. తల్లి కావాలని. ఇందుకోసం పురిటి నొప్పులను సైతం ఇష్టంగా భరిస్తారు. గర్భిణులుగా ఉన్న సమయంలో ప్రతి మహిళా.. పుట్టబోయే బిడ్డ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. బిడ్డ ఎలా పుడుతుంది. ఆరోగ్యంగా ఉంటారా లాంటి ఎన్నో సందేహాలతో సమతమతమవుతుంటారు.
అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే కాదు వారి గురించి కూడా కాస్త ఆలోచించాలని వైద్యులు చెబుతున్నారు. తల్లి , బిడ్డ ఆరోగ్యానికి గర్భిణులు పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. వీటితో పాటుగా కుంకుమ పువ్వును కూడా గర్భిణులు చెబుతున్నారు. కుంకుమ పువ్వు వల్ల బిడ్డ తెల్లగా పుడుతుందో లేదో తెలియదు కానీ.. ఆరోగ్యంగా మాత్రం పుడతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కుంకుమ పువ్వు తల్లి అన్ని విధాల ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
saffron
గర్భిణులు తొమ్మిది నెలల పాటు కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఎన్నోఅద్బుత ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద పరంగా చూస్తే కుంకుమ పువ్వుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Saffron
ఎనకటి కాలం నుంచి గర్భిణులకు పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఇవ్వడం అనవాయితీగా వస్తూనే ఉంది. దీని వల్ల పిల్లలు తెల్లగా పుడతారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విషయం వాస్తవమో కాదో తెలియదు కానీ పిల్లల ఆరోగ్యానికి, తల్లి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భంతో ఉన్నప్పుడు మహిళలు శరీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆందోళ, చికాకు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కుంకుమ పువ్వు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది గర్భిణులను ప్రశాంతంగా ఉంచుతుంది.
నెలలు నిండే కొద్దీ ..పిండం పెరుగుతుంటే పొట్ట పెరుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో వీళ్లు నొప్పులు, నిద్రలేమి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారికి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కాస్త కుంకుమ పువ్వు కలిపి ఇస్తే వారు ప్రశాంతంగా నిద్రపోతారు. అలాగే దురద, తిమ్మిర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
saffron
కుంకుమ పువ్వు గుండె పనితీరును మెరుపరుస్తుంది. అలర్జీలు, అసిడిటీ, దగ్గు, కడుపు ఉబ్బరం, జలుబు, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. మొటిమలను, మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా కుంకుమ పువ్వు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భిణుల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను కూడా పెంచుతుంది. అలాగే పొటాషియం లెవెల్స్ ను కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చే కుంకుమ పువ్వును పరిమితిగానే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.