ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే ఏమౌతుంది?
చాలా మంది ఇండ్లల్లో మనీ ప్లాంట్ పక్కాగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఉంటే అంతా మంచే జరుగుతుందని, ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదని నమ్ముతారు. కానీ ఈ మొక్క ఇంటి దగ్గర ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర రకరకాల మొక్కలు, చెట్లు ఉంటాయి. వీటిలో మనీ ప్లాంట్ ఒకటి. చాలా మంది మనీ ప్లాంట్ ను పెంచుతారు. ఇది ఇంటిని అందంగా మార్చేస్తుంది. అంతేకాదు దీన్ని అదృష్ట మొక్క అని నమ్ముతారు. ఈ మొక్క ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని, ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదని నమ్ముతారు. అందుకే ఈ మొక్క ఆకులు ఎండిపోతే మంచిది కాదని, ఇది చెడుకు సంకేతమని భావిస్తారు. ఇదంతా మతపరంగా. కానీ ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది
అవును మనీ ప్లాంట్ సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది. మీ ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఈ మొక్కను నాటడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది ప్రధానమైంది. మనీ ప్లాంట్ మొక్క చుట్టుపక్కలున్న గాలిని సహజంగా శుద్ధి చేస్తుంది. ఈ మనీ ప్లాంట్ మొక్కను పెంచడానికి పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.
ఈ ఇండోర్ మొక్కలు చుట్టుపక్కలన్న వాతావరణం నుంచి కలుషితాలను తొలగిస్తుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు ఇది రాత్రిపూట మనకు ఆక్సిజన్ ను కూడా ఇస్తుంది.
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది
ఈ గజిబిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైన సమస్యలుగా మారిపోయాయి. వీటిని సహజంగా తగ్గించుకోవాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను ఖచ్చితంగా నాటండి.
ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ దగ్గర కాసేపు ఉన్నా, వాటితో మాట్లాడినా ఒత్తిడి కొంతవరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నారు. ముఖ్యంగా మనీప్లాంట్ ప్లాంట్ ను అలాగే ఐదు నిమిషాల పాటు చూడటం వల్ల చాలా మందిలో ఒత్తిడి, ఆందోళన స్థాయి కొంతవరకు తగ్గిందని కనుగొన్నారు.
యాంటీ రేడియేటర్ లా పనిచేస్తుంది
అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. కానీ మనీ ప్లాంట్ యాంటీ రేడియేటర్ లాగా పనిచేస్తుందని నమ్ముతారు. మన చుట్టూ ప్రమాదకరమైన రేడియేషన్ ఉంది. అంటే వై-ఫై, కంప్యూటర్, టీవీ లేదా మొబైల్ ఫోన్; అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ప్రమాదకరమైన రేడియేషన్ విడుదల అవుతుంది.
ఇలాంటి పరిస్థితిలో మీ ఇంట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాల చుట్టూ మనీ ప్లాంట్ ను పెడితే దాని నుంచి వెలువడే తరంగాల మన వరకు రాకుండా ఉంటాయి. ఈ మొక్క వాటిని గ్రహిస్తుంది.
కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ
కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా మనీ ప్లాంట్ సహాయపడుతుంది. ఇంట్లో వై-ఫై రూటర్ దగ్గర మనీ ప్లాంట్ ను పెడితే మీ పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. అలాగే పెద్దవారిలో ఒత్తిడి, తలనొప్పి సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది.
మనీ ప్లాంట్ మన మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుంది. దీంతో మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతారు. మనీ ప్లాంట్ సహజంగా గాలిని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది కాబట్టి.ఇది కుటుంబ సభ్యులందరి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపెడుతుంది.