Health Tips: పెద్దలు నేలమీద కూర్చొని తినమనేది ఇందుకోసమే..!
Health Tips: నేలమీద కూర్చొని తినడం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నేడు చాలా మంది ఈ అలవాటును పూర్తిగా మర్చిపోయారు. కానీ దీనివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే షాక్ అవుతారు.

ఒకప్పుడు నేల పై కూర్చొని తినడం భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ ఇది ఇప్పుడు లేదు. ఈ గజిబిజీ లైఫ్ లో చాలా మంది నేలపై కూర్చొని తినడమే మర్చిపోయారు. అంతెందుకు ఇంటిళ్లిపాది తినేందుకు మంచి మంచి డిజైన్లలో ఉండే డైనింగ్ టేబుల్ ను వాడుతున్నారు. కింద కూర్చొని తినడం నామోషీగా ఫీలవుతున్నారు. అందుకే చాలా మంది ఈ రోజుల్లో డైనింగ్ టేబుల్ మీదే తినడం అలవాటు చేసుకుంటున్నారు. టేబుల్ మీద కూర్చొని తినడం కంఫర్ట్ గా అనిపించినా.. నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అన్నం లేదా రొట్టేను నేల మీద కూర్చొని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హై బీపీ పేషెంట్ల ఆరోగ్యానికి మంచిది..
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు నేలమీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నేలపై కూర్చొని తినడం వల్ల వెన్నెముక దిగువ భాగంపై ఒత్తిడి పడుతుంది. ఇది మీకు రిలాక్సేషన్ అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాదు తినేటప్పుడు శ్వాస నెమ్మదిగా సాగుతుంది. ఇది కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది.
జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది
నేలపై కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. నేలపై కూర్చొని ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆహారమైనా చాలా ఫాస్ట్ గా అరుగుతుంది. ఎందుకంటే నేలపై కూర్చున్నప్పుడు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది.
మోకాళ్ల సమస్యలు తగ్గుతాయి
మోకాళ్ల సమస్యలను తగ్గించుకోవాలనుకునే వారు కిందకూర్చొని తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కండరాలను దృఢంగా ఉంచుతుంది
కింద కూర్చొని తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. నేలపై కూర్చొని ఆహారం తినే వారి శరీరం చురుకుగా, సరళంగా ఉంటుంది. ఎముకల బలహీనత కూడా తగ్గుతుంది.
గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి..
నేల మీద కూర్చొని తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా నేలమీద కూర్చొని తింటే శరీర బరువు పెరిగే ప్రమాదమే ఉండదు. ఊబకాయం కూడా తగ్గుతుంది.