Health Tips: పరిగడుపున ఒకే ఒక్క టీ స్పూన్ నెయ్యి తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?
Health Tips: ఇప్పటి నుంచి ప్రతిరోజూ ఉదయం పరిగడుపున ఒకే ఒక్క టీ స్పూన్ నెయ్యిని తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం.. స్వచ్ఛమైన నెయ్యి ఎన్నో రోగాలను నయం చేస్తుంది. ముఖ్యంగా దీన్ని ఉదయం పరిగడుపున తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇది మన శరీరంలోని ప్రతి కణానికి పోషణ అందిస్తుంది. దేశీ నెయ్యిలో కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీనిలో సంతృప్త కొవ్వులు 62 శాతం ఉంటుంది. ఇది Lipid profile దెబ్బతినకుండా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
నెయ్యిలో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఉదయాన ఒక టీస్పూన్ దేశీ నెయ్యిని తింటే చాలా సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది. నెయ్యి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. దీన్ని మోతాదులోనే తినాలి. పరిమితికి మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఖాళీ కడుపున నెయ్యిని తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
మెరిసే చర్మం
నెయ్యి ఒక నేచురల్ మాయిశ్చరైజర్. దీన్ని పరిగడుపున తింటే శరీరం లోపలి నుంచి బయటి వరకు శుభ్రమవుతుంది. ఇది మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ముఖంపై ఉండే ముడతలను, మొటిమలను తగ్గిస్తుంది. ఒక టీ స్పూన్ నెయ్యిని తిన్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగితే ఉత్తమ ఫలితాలొస్తాయి.
రక్తప్రసరణ
రెగ్యులర్ గా టీస్పూన్ నెయ్యిని తీసుకోవడం వల్ల ధమనులు బలపడతాయి. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర కణాల్లో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది
నెయ్యిని కీళ్లను లూబ్రికేట్ చేస్తుంది. ఇది కాల్షియం శోషణను కూడా పెంచుతుంది. నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. శరీర వ్యవస్థను బలంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా నెయ్యిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
ఇంట్లో తయారుచేసిన నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్నికూడా మెరుగుపరుస్తుంది. అనేక దీర్ఘకాలికి రోగాలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి.
ఆరోగ్యకరమైన జుట్టు
పరిగడుపున ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవడం వల్ల అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఇది జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిస్తుంది. జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. చుండ్రు సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.
నెయ్యిలో కొద్దిగా పసుపును కలిపి తాగితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అంతేకాదు డ్రై కాఫ్ ను నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. పరిగడుపున నెయ్యిని తాగితే ఆకలి కూడా పెరుగుతుంది.