30 రోజుల్లో పొట్ట, బరువు తగ్గాలా? అయితే ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి
చాలా మంది పొట్టను తగ్గించుకునేందుకు ఎన్నో చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయినా పొట్ట మాత్రం ఇంచు కూడా తగ్గదు చాలా మందికి. అయితే ఉదయాన్నే పరిగడుపున ఒక పానీయాన్ని తాగితే మాత్రం ఖచ్చితంగా మీ పొట్ట తగ్గుతుంది.

పొట్టను తగ్గించే నీళ్లు
మనలో చాలా మంది ఉదయాన్నే పరిగడుపున నీళ్లను తాగుతుంటారు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది అయితే వేడినీళ్లను తాగుతుంటారు. నిజానికి పరిగడుపున వేడి నీళ్లను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
వేడి నీళ్లు
మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణసమస్యలతో బాధపడేవారికి వేడి నీళ్లు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే తిన్నది తొందరగా జీర్ణమవుతుంది.
పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి?
బరువు తగ్గాలనుకుంటే మాత్రం మర్చిపోకుండా ప్రతిరోజూ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగండి. ఇది మీ శరీర ఉష్ణోగ్రను పెంచి మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో పేగుల్లోని కొవ్వు పొరలు విచ్ఛిన్నం అవుతాయి. అలాగే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
బరువును తగ్గించే చిట్కాలు
మీరు రెగ్యులర్ గా పరిగడుపున వేడినీళ్లు తాగితే గట్టిపడిన కొవ్వు విచ్ఛిన్నం అవుతుంది. అలాగే ఆహారం సులువుగా జీర్ణం అవవుతుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.మీరు తినడానికి ముందు ఒక గ్లాస్ వేడినీళ్లను తాగితే పోషకాల శోషణ పెరుగుతుంది.
వేడినీళ్ల ప్రయోజనాలు
వేడినీళ్లు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీంతో మీ శరీరం మంచి విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే ఒత్తిడిని కలిగించే కార్డిసాల్ హార్మోన్ కూడా తగ్గుతుంది. దీంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా పడుకునే ముందు ఒక గ్లాస్ వేడినీళ్లను తాగితే బాగా నిద్రపడుతుంది.
వేడినీళ్ల ప్రయోజనాలు
వేడినీళ్లు పీరియడ్స్ సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.వేడినీళ్లను తాగితే పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల కండరాలు సడలిస్తాయి. అలాగే వేడినీళ్లను తాగితే శరీరం రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో వాపు, నొప్పి తగ్గుతాయి. అసౌకర్యం నుంచి ఉపశమనం కలుగుతుంది.
వేడినీళ్ల ప్రయోజనాలు
గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.దీంతో మీ చర్మం కాంతివంతంగా అవుతుంది. మీకు తెలుసా? వేడినీళ్లు రక్తప్రసరణను పెంచుతాయి. దీంతో మీ స్కిన్ కు నేచురల్ గ్లో వస్తుంది. అలాగే మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.