- Home
- Life
- Beetroot juice: బీట్ రూట్ జ్యూస్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాదు.. ఆ సమస్యలను తగ్గిస్తుంది కూడా..
Beetroot juice: బీట్ రూట్ జ్యూస్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాదు.. ఆ సమస్యలను తగ్గిస్తుంది కూడా..
Beetroot juice: బీట్ రూట్ జ్యూస్ లో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి.

Beetroot juice: ఆరోగ్యం బాగుండటానికి ప్రతిరోజు వ్యాయామం ఎలా అయితే అవసరమో.. మంచి ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందులోనూ మన ఆరోగ్యానికి బీట్ రూట్ జ్యూస్ చేసే మేలు అంతా.. ఇంతా.. కాదు. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్త నాళాలను మంచి స్థితిలో ఉంటాయి. ఓ పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ తాగేవారిలో మెదడు పనితీరు చురుకుగా ఉంటుందని తేలింది.
బీట్ రూట్ లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతుంది. మీకు తెలుసా.. మట్టిలోపల పెరిగే దుంపలు ఇతర వాటికంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో బీట్ రూట్ ఒకటి. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్లు ఎన్నో స్కిన్ సమస్యలను తొలగించడంతో పాటుగా చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది.
బీట్ రూట్ వయసు మీదపడుతున్న కొద్దీ వచ్చే ముఖంపై ముడతలు, కంటిచూపు మందగించడం, తెల్లజుట్టు వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. ఇక ఇందులో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాస్త మన బాడీలోకి వెల్ల నైట్రిక్ ఆక్సైడ్ గా మారి బ్లడ్ ఫ్లో సులభతరం చేస్తుంది.
బీట్ రూట్ లో కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడంతో పాటుగా శరీరక శక్తిని కూడా పెంచుతాయి.
బీట్ రూట్ మధుమేహులకు కూడా సహాయపడుతుంది. బీట్ రూట్ ను మితంగా తీసుకోవడం వల్ల వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి.
బీట్ రూట్ జ్యూట్టు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. విపరీతంగా హెయిర్ ఫాల్ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు బీట్ రూట్ జ్యూస్ లో కాస్త అల్లం మిక్స్ చేసి తాగితే.. జుట్టు ఊడమన్నా ఊడిపోదు.
రక్తహీనత (Anemia) సమస్యను తగ్గించడానికి కూడా బీట్ రూట్ జ్యూస్ చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. ఇది బ్లడ్ ను శుభ్రపరుస్తుంది కూడా. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
beetroot juice
కాలెయ సంబంధిత సమస్యలు, ప్రమాదకరమైన క్యాన్సర్, స్థూలకాయం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా బీట్ రూట్ జ్యూస్ లో చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది.
ఈ జ్యూస్ ఇమ్యూనిటి పవర్ ను కూడా పెంచుతుంది. అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే కిడ్నీ సమస్యలున్న వారు మాత్రం దీనిని తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.