MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చలికాలంలో కుంకుమ పువ్వును తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

చలికాలంలో కుంకుమ పువ్వును తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

కుంకుమ పువ్వులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. చలికాలంలో కుంకుమ పువ్వును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా చర్మం యవ్వనంగా ఉంటుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 16 2022, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శక్తివంతమైన మసాలా దినుసు. నిజానికి కుంకుమపువ్వును ఒక్క గర్భిణులే కాదు.. ఇతరులు కూడా తినొచ్చు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కుంకుమ పువ్వును తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. లిబిడో స్థాయిలు పెరుగుతాయి. లైంగిక పనితీరు మెరుగుపడుతుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాదు ఇది అలర్జీలను కలిగించదు. అందుకే దీన్ని అందరూ తీసుకుంటారు. అయితే, కుంకుమపువ్వు చాలా ఖరీదైంది. అందుకే చాలా మంది దీనిని ఉపయోగించరు. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

చలికాలంలో కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ ఎరుపు రంగు మసాలాలో చెప్పలేనన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఇది చర్మం, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు కుంకుమపువ్వును తీసుకోవడం వల్ల మీరు మీ వయస్సు కంటే 10 సంవత్సరాలు చిన్నగా కనిపిస్తారు. నిత్య యవ్వనంగా కనిపించడానికి ఇది బాగా సహాయపడుతుంది.

37

కుంకుమపువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు

కుంకుమపువ్వులో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. సూర్యరశ్మి వల్ల కలిగే చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇది చర్మం ముడతలను తగ్గించి.. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది. కుంకుమపువ్వులో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. క్రోసిన్,  క్రోసెటిన్ అనే శక్తివంతమైన కెరోటినాయిడ్లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. 

47

ఆడవాళ్లకు కుంకుమ పువ్వు మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో కుంకుమపువ్వును తీసుకోవడం వల్ల పొత్తికడుపు నొప్పి తగ్గిపోతుంది. మూడ్ మార్పులను కూడా నివారిస్తుంది. తిమ్మిరిని తగ్గిస్తుంది.
 

57

కుంకుమ పువ్వు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల  ఆకలి కోరికలు తగ్గుతాయి. దీంతో మీరు అతిగా తినలేరు. 

కుంకుమ పువ్వు ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది. 
 

67

ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రాత్రిళ్లు మీరు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది

77

ఎలా వినియోగించాలి

రెండు మూడు కుంకుమపువ్వులను తీసుకుని పాలు లేదా మూలికా టీలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే నానబెట్టిన కుంకుమపువ్వును ఉదయం ఖాళీ పరిగడుపున తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ఒక కప్పులో నీళ్లలో రెండు మూడు కుంకుమపువ్వులను వేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ. 30 వేల‌తో మొద‌లై నెల‌కు రూ. 30 ల‌క్ష‌లు.. అవినాష్ స‌క్సెస్ స్టోరీ, ఇలా చేస్తే మీకు కూడా సాధ్య‌మే
Recommended image2
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు
Recommended image3
Gas Burner: గ్యాస్ త్వరగా అయిపోతోందా? అయితే బర్నర్‌ను వెంటనే ఇలా క్లీన్ చేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved