కెఎల్ రాహుల్ గర్ల్ ఫ్రెండ్.. అతియా బ్యూటీ సీక్రెట్ ఇదే..
క్రికెటర్ కెఎల్ రాహూల్ గర్ల్ ఫ్రెండ్ అతియా శెట్టి గురించి తెలుసుకోవాలని ఆయన అభిమానులు వేచి చూస్తుంటారు. మల్లెజాజి తీగలా ఉండే అతియా అంత అందంగా ఉండడానికి రహస్యమేంటా అని ఆలోచిస్తారు. ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఏంటంటే...

అతియా శెట్టి మిలీనియా బ్యూటీ. మోడల్ లాంటి ఆకర్షించే అందం, ఆకట్టుకునే సౌష్టవం, చక్కటి ఎత్తు.. అతియాను మిలీనియా బ్యూటీగా నిలబెడుతున్నాయి.
కెఎల్ రాహుల్, నటి అతియా శెట్టి మధ్య ఏదో నడుస్తుందన్న గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయితే వీరు ఈ పుకార్లకు చెక్ పెడుతూ తాము రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా రివీల్ చేశారు. దీంతో వీరి జంట చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసలు కురిసాయి.
అతియా తన అందానికి మెరుగులు దిద్దుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖానికి ఎప్పుడూ ఫ్రూట్ ఫేస్ మాస్క్ వాడుతుంది. దీన్ని స్వయంగా తయారు చేసుకుంటుంది. ఎలాగంటే..
ఇంట్లో తయారు చేసిన కొబ్బరిపాలు - 2 టేబుల్ స్పూన్లు
సగం అరటిపండు
ఒక టేబుల్ స్పూన్ తేనె
2 టేబుల్ స్పూన్లు పెరుగు
పావు కప్పు బొప్పాయి
వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి.. ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ ఎండిపోవడం మొదలు పెట్టగానే కడిగేసుకోవాలి.
Image: Athiya Shetty/Instagram
వారానికి మూడుసార్లు ముఖానికి కొబ్బరినూనె రాస్తుంది. అంతేకాదు మేకప్ తీయడానికి బేబీ ఆయిల్ ను వాడుతుంది.
ఇక కనుబొమ్మల అందంకోసం కాస్టర్ ఆయిల్ వాడుతుంది. దీనివల్ల కనుబొమ్మలు ఒత్తుగా, అందంగా, తీర్చిదిద్దినట్టుగా ఉంటాయట.
డ్రై స్కిన్ కోసం ఆమె.. ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ టిప్ చెప్పింది. విటమిన్ సి లేదా ఈ క్యాప్సూల్ ను కట్ చేసి దీన్ని ముఖానికి ఫేస్ మాస్క్ లా అప్లై చేయాలని చెప్పుకొచ్చింది.
ఒత్తైన, నిగనిగలాడే అందమైన జుట్టుకోసం అతియా తన జుట్టుకు ఆనియన్ ఆయిల్ ను వాడుతుంది. దీని వల్ల పొడవాటి ఆరోగ్యవంతమైన జుట్టు తనసొంతం అవుతుందని నమ్ముతుంది.
బియ్యాన్ని 6,7 గంటలు నానబెట్టి.. ఆ నీటిని ఓ బాటిల్ లోకి పోసి.. దాన్ని జుట్టుకు స్ప్రే చేయడానికి వాడుతుంది. ఇది జుట్టుకు కావాల్సిన మంచి కండీషనర్ గా పనిచేస్తుందని చెప్తారామె.