Life Lesson: బతికితే రామచిలకలాగా బతకాలి.. ఎందుకో తెలుసా?
Life Lesson: ఈ భూమి మీద చాలా రకాల ప్రాణులు ఉన్నాయి. ఒక్కో ప్రాణికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, మనిషి తన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే రామ చిలకలా జీవించాలి అని చాణక్యుడు చెబుతున్నాడు.

Wisdom Lessons
ఆచార్య చాణక్యుడి గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు.ఆయన చాలా గొప్ప ఆలోచనాపరుడు. ఆర్థిక వేత్త, దౌత్యవేత్త కూడా. ఆయన చాణక్య నీతి అనే గ్రంథాన్ని రచించారు. దానిలో మనిషి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు పొందుపరిచారు.
చాణక్యుడి ప్రకారం ప్రకృతి మానవునికి ఉత్తమ గురువు. ప్రకృతి నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈ ప్రకృతిలో వేలాది జంతువులు, పక్షులు నివసిస్తాయి వాటిలో ప్రతిదానికీ విభిన్నమైన గుణాలు, ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిలో రామ చిలక మాత్రం చాలా ప్రత్యేకం. చిలక జీవితం నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటే.. జీవితంలో విజయం సాధిస్తారని చాణక్యుడు చెప్పాడు. మరి.. చిలక నుంచి ఏ విషయాలు నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
మధురమైన వాక్కు...
రామ చిలుక స్వరం చాలా మధురంగా ఉంటుంది. అది తన స్వరంతో ఎవరి హృదయాన్ని అయినా సులభంగా గెలుచుకోగలదు. అది ఎల్లప్పుడూ అందరి ప్రేమ కోరుకుంటుంది. ఆ చిలక లాగానే.. మనం కూడా మధురమైన స్వరాన్ని సంపాదించుకోవాలి. మన మాటలు ఇతరులను మనసు బాధ పెట్టేలా ఉండకూడదు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు ఇలా చిలకాలంటి స్వరంతో ఉంటే.. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అప్రమత్తంగా ఉండాలి...
ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవరూ ఊహించలేరు. రామచిలుక ఎప్పుడూ ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటుంది. మనుషులు కూడా అలానే ఉండాలి. చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి తనకు ఎదురయ్యే సంక్షోభానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల గురించి...సరైన ప్రణాళికలు వేసుకోవాలి. ఈ విషయంలో అలర్ట్ గా ఉంటే... జీవితంలో వచ్చే సమస్యలను ఈజీగా ఎదురుకోగలరు. ఇబ్బంది పడరు.
అభ్యాసం..
చిలక నుంచి నేర్చుకోవాల్సిన మరో గుణం ఉంది...అదే అభ్యాసం. చిలుక ఒక తెలివైన జంతువు. మనం నేర్పించినట్లుగా అది మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. మనం నేర్పినదాన్ని అది పదే పదే ప్రాక్టీస్ చేస్తుంది. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల అది మంచి నైపుణ్యం సాధిస్తుంది. మనం కూడా.. ఏదైనా విషయం నేర్చుకుంటే.. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మంచి టాలెంట్ సాధించగలరు. చిలక నుంచి ఈ మూడు విషయాలు నేర్చుకుంటే.. జీవితంలో కచ్చితంగా సక్సెస్ అవుతారు.

