బాత్ రూం నుంచి వాసన రావొద్దంటే ఏం చేయాలి?
చలికాలంలో బాత్ రూం నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం బాత్ రూం నుంచి దుర్వాసన అస్సలు రాదు. అదెలాగంటే.
చలికాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు బాత్ రూం ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే బాత్ రూం నుంచి దుర్వాసన వస్తుంది. ఈ వాసనకు బాత్ రూంలోకి కూడా వెళ్లాలనిపించదు. అయితే చాలా మంది బద్దకం వల్ల బాత్ రూంని క్లీన్ చేయరు. దీనివల్ల బాత్ రూంలో మురికి పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. అయితే కొన్ని చిట్కాలతో బాత్ రూంని చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే?
బాత్రూమ్ శుభ్రపరిచే చిట్కాలు
శీతాకాలంలో బాత్రూమ్ శుభ్రం చేయడానికి చిట్కాలు:
1. బాత్ రూంను క్లీన్ చేయడానికి ఒక పద్దతి ఉంటుంది. దీని ప్రకారం.. క్లీన్ చేస్తే నిమిషాల్లోనే బాత్ రూం తలతలా మెరిసిపోతుంది. ఇందుకోసం ముందుగా బాత్రూమ్ కిటికీలను, తలుపులను తుడవండి. ఆ తర్వాత వాష్ బేసిన అద్దాన్ని క్లీన్ చేయండి. అది కూడా తడిగుడ్డతో.
2. ఆ తర్వాత ఒక బకెట్ వేడి వాటర్ ను తీసుకుని అందులో నిమ్మరసం కలపండి. ఈ నీళ్లతో బాత్ రూం ఫ్లోర్ ను శుభ్రం చేయండి. దీంతో ఫ్లోర్ కు ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ లు చనిపోతాయి. ఫ్లోర్ కు లేకుండా పోతాయి. అయితే మీరు ఈ నిమ్మరసానికి బదులుగా వెనిగర్ ను కూడా వాడొచ్చు. అయితే వెనీగర్ ను వాడితే మాత్రం చేతులకు గ్లౌజులు ఖచ్చితంగా వేసుకోవాలి.
3. బాత్ రూం ఫ్లోర్ ను క్లీన్ చేయడానికి మీరు వేడినీళ్లలో బ్లీచింగ్ పౌడర్ ను కూడా కలపొచ్చు. దీనితో నేలను తుడిస్తే ఫ్లోర్ కు అంటిన నల్లని మరకలు, ఇతర మరకలు పోయి తలతలా మెరిసిపోతుంది. అలాగే బాత్ రూం నుంచి దుర్వాసన కూడా రాదు.
4. బాత్ రూం నుంచి మురికి వాసన వస్తుంటే దీన్ని శుభ్రం చేయడానికి మీరు రూం ఫ్రెషనర్ ను కూడా వాడొచ్చు. ఇది బాత్ రూం మొత్తం మంచి సువాసన వచ్చేలా చేస్తుంది. అయితే దీన్ని మూడు నాలుగురోజులకోసారి ఖచ్చితంగా మార్చాలి.
5. బేపకింగ్ సోడాతో కూడా బాత్ రూం నుంచి దుర్వాసనను, మురికి వాసనను పోగొట్టొచ్చు. ఇందుకోసం బాత్ రూం మొత్తం బేకింగ్ సోడాను చల్లండి. కొద్దిసేపటి తర్వాత వేడి నీళ్లతో దీన్ని శుభ్రం చేయండి. దీంతో బాత్ క్లీన్ అవుతుంది. మురికి వాసన కూడా పోతుంది.
6. లావెండర్ ఆయిల్ ను కూడా మీరు బాత్ రూంను క్లీన్ చేయడానికి వాడంొచ్చు. ఇందుకోసం నీళ్లలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ ను వేసి కలపండి. ఈ వాటర్ తో బాత్ రూంని క్లీన్ చేయండి. దీంతో బాత్ రూం నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది. అలాగే బాత్ రూం శుభ్రంగా అవుతుంది. అలాగే ఒక గుడ్డను వెనిగర్ లో ముంచి బాత్ రూంలో ఉంచినా కూడా దుర్వాసన రాదు.
7. చలికాలంలో చాలా మంది ఇంటి కిటికీలు, తలుపులను మూసే ఉంచుతారు. దీనివల్ల ఇంట్లోని గాలి బయటకు పోదు. బయటి గాలి లోపలికి రాదు. దీనివల్ల కూడా మురికి వాసన వస్తుంది. ఇంట్లో కానీ, బాత్ రూంలో కానీ దుర్వాసన రావొద్దంటే ఇంటి కిటికీలు, తలుపులే కాదు బాత్ రూం కిటీకీలు, బాత్ రూం డోర్ కూడా తెరిచి పెట్టాలి. దీనివల్ల బాత్ రూం నుంచి దుర్వాసన రాదు.
గమనిక: చలికాలంలో ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా బాత్ రూంని క్లీన్ చేయాలి. దీంతో బాత్ రూంలో దుమ్ము, ధూళి పేరుకుపోవు. వాసన రాదు.