మీ పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారా?.. వారి రాశిచక్రం ప్రకారం ఇలా చేస్తే సరి..
ప్రతీ తల్లిదండ్రులకు పిల్లల మీద తమ ప్రేమను వ్యక్తీకరించడానికి వారిదైన పద్ధతి ఉంటుంది. కొంతమంది మరీ ఎక్కువ గారాబం చేస్తే పిల్లలు చెడిపోతారని కాస్త కఠినంగా ఉంటారు. మరికొందరు ప్రేమను వ్యక్తపరుస్తూనే వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎదగడానికి సహకరిస్తారు. మరికొందరు ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి అంటూ ఆంక్షలు పెడుతుంటారు.
ప్రేమ అయినా.. క్రమశిక్షణ అయినా హద్దు దాటితే అంత మంచిది కాదు. అలాగని అందరు పిల్లలకు ఒకే రకమైన ఫార్ములా పనిచేయదు. మీ పిల్లల రాశి ప్రకారం వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. అదెలాగో చూడండి..
కర్కాటకం, మీనం, వృశ్చికం
ఈ రాశిచక్రాల పిల్లలు ప్రేమిస్తే అల్లుకుపోతారు. అయితే అది బయటికి చెప్పరు. వీరు చాలా సున్నిత మనస్కులు. ఈ పిల్లలు కుటుంబంతో, ముఖ్యంగా తల్లులతో బాగా అటాచ్డ్ గా ఉంటారు. వీరిని బాధపెట్టకుండా ప్రేమించడం ఎలాగో తల్లిదండ్రులు నేర్చుకోవాలి. తమ కోపాన్ని అదుపు చేసుకుని.. ప్రతీదీ పిల్లలకు ప్రేమా చెప్పాలి. అలాగని అతి గారాబం చేయకూడదు. ఇక మీనరాశి పిల్లలను మర్యాదగా చూసుకోవాలి. వారికి తమ లక్ష్యం ఏంటో తెలుసు. కానీ ఎలా అక్కడికి చేరుకోవాలో తెలియదు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారికి మార్గనిర్దేశం చేయాలి. వారికి సలహా ఇవ్వాలి. వారికి సృజనాత్మకత స్వేచ్ఛను ఇస్తే వారు తమ మనసులో అనుకున్న వాటిల్లో చాలా బాగా రాణిస్తారు.
parents quarrel
వృషభం, కన్య, మకరం
ఈ రాశులకు చెందిన పిల్లలు అన్నింటికంటే భౌతిక సుఖాలను ఎక్కువగా అభినందిస్తారు. అందువల్ల, విలాసం కంటే ప్రేమ విలువను వారికి నేర్పడం చాలా అవసరం. ఓ తెగ ప్రేమ కురిపించడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదు. అయినా కూడా వారు ఏదైనా సాధించాలనుకుంటే క్రమం తప్పని ప్రశంసలు, మెచ్చుకోలు అవసరం అవుతాయి. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరైనా వీరితో చాలా స్నేహంగా ఉండాలి. అప్పుడే వీరు మనసువిప్పి అన్నీ చెప్పుకోగలుగుతారు. లేకపోతే తమ సమస్యలను ఎప్పటికీ బయటపెట్టరు.
తులారాశి, మిధునం, కుంభరాశి
ఈ ఎయిర్ సైన్స్ తో సమతుల్యతను సాధించడం కష్టం. మీ పిల్లల రాశీచక్రం ఇందులో ఒకటి అయితే.. ప్రతీచిన్న విషయానికి ప్రేమగా ఉండేలా జాగ్రత్తపడండి. తద్వారా మీ బిడ్డ సంతోషంగా ఉంటారు. ఈ రాశిచక్రాల పిల్లలు అందం, లగ్జరీ, సౌకర్యాన్ని ఇష్టపడతారు. అయినప్పటికీ, వారు అనవసరమైనవి కొనరు. బ్యాలెన్స్‌గా ఉంటారు. మీరు ప్రేమగా వారికి చెప్పేది.. ఇచ్చేది ఏదైనా ఇష్టపడతారు. వీరికి మర్యాదపూర్వకంగా ఉండడం నేర్పించడం ముఖ్యం. తమ శక్తిని సరైనవిధంగా ఉపయోగించుకునేలా గైడ్ చేయాలి. వీరు చాలా తేలికగా డిస్ట్రాక్ట్ అవుతారు. తమ కంఫర్ట్ జోన్ లోకి వెళ్లిపోతారు. అందుకే వీరిని పుష్షింగ్ కావాలి. అప్పుడప్పుడు చిన్న విహారయాత్ర లేదా పిక్నిక్ లు తీసుకువెడితే ఆనందిస్తారు.
మేషం, సింహం, ధనుస్సు
ఈ రాశిచక్రాల పిల్లలకు చాలా శ్రద్ధ అవసరం. తల్లిదండ్రులుగా వారికి మీరెంత ప్రేమ, శ్రద్ధ పంచితే వారు అంతకంటే ఎక్కువ తిరిగి ఇస్తారు. అందుకే వీరికి అవసరానికి తగినంతగా మాత్రమే ఏదైనా నేర్పించాలి. ప్రేమను పంచాలి. ప్రేమించడం, చాలా ఎక్కువ ప్రేమించడం మధ్య లైన్ ను తెలుసుకుని ఉండాలి. వీరు కోపంతో ఏం చెప్పినా వినరు. వారి తప్పు వారు తెలుసుకునేలా చేయడానికి సరైన మార్గం నిశ్శబ్దంగా ఉండిపోవడమే.. వారిని అవాయిడ్ చేయడమో అంతే. వీరు తొందరగా ఆత్మన్యూనతకు లోనవుతారు. అతిగా ఆలోచిస్తుంటారు. అందుకే వీరితో ఎప్పటికప్పుడు మాట్లాడటం, వారి మనస్సును కనిపెట్టుకుని ఉండడం చేయాలి.