MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ తప్పులే మీ అనుబంధానికి చెక్ పెడతాయి.. ఏ రాశుల వారు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారంటే...

ఈ తప్పులే మీ అనుబంధానికి చెక్ పెడతాయి.. ఏ రాశుల వారు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారంటే...

ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు.. ఆ బంధాన్ని కాపాడుకోవడానికి భాగస్వాములిద్దరూ కృషి చేస్తారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ, అప్యాయత, కేర్ ఇలాంటివి వారి అనుబంధాన్ని బల పరుస్తాయి. అదే సమయంలో కొన్ని తప్పులు వారి అనుబంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి తప్పులేంటో ఒక్కసారి చూడండి. 

2 Min read
Bukka Sumabala
Published : Jun 30 2022, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
aries

aries

మేషరాశి : మేషరాశివారు తమ భాగస్వాములను టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అందుకే వారేం చేసినా మనవాళ్లే కదా అన్నట్టుగా ప్రశంసించడం కానీ, మెచ్చుకోవడం కానీ చేయరు. అలా చేయడం వల్ల అనుబంధంలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

212
Taurus

Taurus

వృషభరాశి : వీరు ఏ ఎమోషన్ నూ ఆపుకోలేరు. మీలో పొంగి పొర్లుతున్న భావోద్వేగాలను మీ భాగస్వామి ముందు వ్యక్త పరచకపోవడమే మంచిది. 

312

మిధునరాశి : మీ అనుబంధం బాగా లేదనుకున్నప్పుడో.. మీ ఇద్దరికీ సరిపడడం లేదనుకున్నప్పుడు వెంటనే అనుబంధాన్ని తెంచుకోవడానికి వెనుకాడరు. కనీసం అసలు సమస్య ఏంటి.. దానికి ఏదైనా పరిష్కారం ఉందా? అని ఒక్కసారి కూడా ఆలోచించరు. సింపుల్ గా వదిలేస్తారంతే.

412

కర్కాటకరాశి : ఎంతసేపూ మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నిస్తారు. దీనివల్ల మీరేంటో.. మీ వ్యక్తిత్వమేంటో, మీ ఉనికేంటో మరిచిపోతే ప్రమాదం ఉంది.

512

సింహరాశి : మీ కోపం, విసుగు, చిరాకు, ఆందోళన, ఆవేశం.. ఇలాంటి భావాలన్నీ మీ భాగస్వామి మీదే చూపిస్తారు. అలా మీరు రిలీష్ అవుతారు. కానీ మీ భాగస్వామి దీనివల్ల ఎంత తీవ్రంగా గాయపడతారో అర్థం చేసుకోరు. 

612
Virgo

Virgo

కన్యారాశి : మీ భాగస్వామి మీ అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలని భావిస్తారు. వారిని అలా మార్చడానికి ప్రయత్నిస్తారు. 

712
Libra

Libra

తులారాశి : కొన్ని సార్లు ఎదుటివారికి సంతోషపెట్టాలని మీ ఫీలింగ్స్ ను ఫేక్ చేస్తారు. ఒకానొక సమయంలో ఇది కాస్తా బయటపడి వారికి తీవ్రంగా బాధ కలిగిస్తుంది. 

812
Scorpio

Scorpio

వృశ్చికరాశి : ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడానికి బదులు.. పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. డ్రామా క్వీన్ లేదా డ్రామా కింగ్ గా మారిపోతారు. 

912

మకరరాశి : మీరంతట మీరే మీ బంధాన్ని చెడగొట్టుకుంటారు. ఎదుటివారి ఎక్స్ పెక్టేషన్స్ ను తగ్గట్టుగా ఉండలేమోమోనని భయమే దీనికి కారణం.

1012
Aquarius

Aquarius

కుంభరాశి : మీ అనుబంధంలో మీదే పై చేయిగా ఉండాలనుకుంటారు. ఈ స్వభావమే మీ రిలేషన్ షిప్ కు దెబ్బగా మారుతుంది.

1112
Pisces

Pisces

మీనరాశి : మీ సంబంధాన్ని నిలుపుకోవాలన్న అతి జాగ్రత్తలో పడి మిమ్మల్ని మీరు కోల్పోతారు. అందుకే ఎంతసేపు మీ భాగస్వామి గురించే కాకుండా మీ కోసం కూడా సమయం కేటాయించుకోండి.

1212
Sagittarius Zodiac

Sagittarius Zodiac

ధనుస్సురాశి : మీ ఫీలింగ్స్ ను నిజాయితీగా చెప్పడానికి ఇష్టపడరు. దాన్ని అవాయిడ్ చేస్తారు. ఇది మీ భాగస్వామిని డిసప్పాయింట్ చేస్తుంది. 

About the Author

BS
Bukka Sumabala
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved