MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Cream Biscuits: మీ పిల్లలకు క్రీమ్ బిస్కెట్లు పెడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Cream Biscuits: మీ పిల్లలకు క్రీమ్ బిస్కెట్లు పెడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో వారు అడిగినప్పుడల్లా క్రీమ్ బిస్కెట్లు కొని ఇస్తూ ఉంటారు. కానీ వైద్యులు చెబుతున్న ప్రకారం క్రీమ్ బిస్కెట్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో హానికరం. అదెలాగో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 10 2025, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రీమ్ బిస్కెట్లు డేంజర్
Image Credit : Pixabay

క్రీమ్ బిస్కెట్లు డేంజర్

సాధారణ బిస్కెట్ల కంటే క్రీమ్ బిస్కెట్లను పిల్లలు ఇష్టపడతారు. లోపల ఉండే క్రీమ్ అంటే వారికి చాలా ఇష్టం. అది ఎంతో తియ్యగా ఉంటుంది.  పిల్లలు మారాం చేస్తే తల్లిదండ్రులు కొనిస్తారు. కానీ అలా కొనివ్వడం పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేయడమేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బిస్కెట్లే ఆరోగ్యకరమైనవి కావు. అందులో క్రీమ్ బిస్కెట్లు మరింత హానికరం. క్రీమ్ బిస్కెట్లు ఎందుకు తినకూడదో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
క్రీమ్ వల్లే నష్టం
Image Credit : Pixabay

క్రీమ్ వల్లే నష్టం

తీపిగా ఉండే క్రీమ్ బిస్కెట్లలో చెడు కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ బిస్కెట్లలో ఉండే క్రీమ్ లో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇది పిల్లలకే కాదు ఎవరికీ మంచిది కాదు. కూరగాయల వ్యర్థాల నుండి తీసిన కొవ్వును బిస్కెట్ల మధ్య క్రీమ్ అని పెడతారు. తీపి కోసం చక్కెర సిరప్, రంగు కోసం కృత్రిమ రంగులు, రుచి కోసం రసాయనాలు కలిపి క్రీమ్ బిస్కెట్ తయారు చేస్తారు. ఇవి చెడిపోకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు.

36
చెడు కొవ్వు పెరిగిపోతుంది
Image Credit : istockphoto

చెడు కొవ్వు పెరిగిపోతుంది

క్రీమ్ లో ఉండే కూరగాయల కొవ్వు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది శరీరంలో చెడు కొవ్వును పెంచుతుంది. ఈ బిస్కెట్లు అధికంగా తింటే గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు వీటిని తింటే బరువు త్వరగా పెరుగుతారు. చిన్న వయస్సులోనే డయాబెటిస్ రావడానికి కూడా క్రీమ్ బిస్కెట్లు కారణం కావచ్చు.

46
పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి
Image Credit : istockphoto

పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి

క్రీమ్ బిస్కెట్లలోని ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కడుపు, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటాయి.

56
పిల్లల ప్రవర్తనా మారుతుంది
Image Credit : istockphoto

పిల్లల ప్రవర్తనా మారుతుంది

ఈ బిస్కెట్లను ఆకర్షణీయంగా మార్చడానికి కళ్ళు చెదిరే రంగుల్లో క్రీమ్‌లు వేస్తారు. ఈ రంగుల కోసం కలిపే కొన్ని రసాయనాలు పిల్లల నాడీ వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లలు హైపర్ యాక్టివ్‌గా, చిరాకుగా మారతారు. ADHD, అలెర్జీలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు రావొచ్చు.

66
ఆకలి పెరుగిపోతుంది
Image Credit : istockphoto

ఆకలి పెరుగిపోతుంది

ఈ బిస్కెట్లలో ఉండే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీనివల్ల ఆకలి ఎక్కువగా అవుతుంది. బరువు పెరగడం, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు చిన్న వయస్సులోనే కొవ్వు కాలేయ వ్యాధి రావొచ్చు. ఇంట్లోనే బెల్లం వేసి, చిరుధాన్యాలతో బిస్కెట్లు చేసివ్వవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Recommended image2
ఈ ప్రదేశంలో ఉప్పును అస్సలు పెట్టకండి
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. అమ్మాయిలు ఇష్టపడేది ఇలాంటి అబ్బాయిలనే!
Related Stories
Recommended image1
Anshu reddy: పెళ్లి క్యాన్సిల్, యూట్యూబ్ నుంచి నాలుగు లక్షల ఆదాయం... ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved