మీ ప్రాణస్నేహితుల మాజీతో ప్రేమలో పడ్డారా? అయితే ఇవి మీ కోసమే...
ఎప్పుడు, ఎలా, ఎవరితో ప్రేమలో పడతాం.. అనేది చెప్పలేం. ఆకర్షణ పుట్టకుండా.. అది ప్రేమగా మారకుండా చూడడం మనచేతుల్లో లేనిపని.. అలా మీ బెస్ట్ ఫ్రెండ్ మాజీతో మీరు తాజాగా ప్రేమలో పడొచ్చు. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమను ఎలాగూ నిలవరించలేం కాబట్టి.. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే.. మీ స్నేహం చెడకుండా.. మీ బంధం విడిపోకుండా ఉంటుంది.
నిజాయితీ, పారదర్శకత ముఖ్యం..
మీ బెస్ట్ ఫ్రెండ్ మాజీతో మీరు రిలేషన్ లో ఉన్న విషయంలో అతడు లేదా ఆమెకు అబద్ధాలు చెప్పడం సరికాదు. ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. వారు బాధపడతారని విషయాన్ని దాస్తే ఇబ్బందుల్లో పడతారు. ముందుగానే మీ రిలేషన్ గురించి చెప్పడం వల్ల మొదట ఇబ్బంది పడ్డా, బాధ పడ్డా అర్థం చేసుకుంటారు. అది, మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ కు కాస్త ఇబ్బందిగా అనిపించినా అదే సరైన మార్గం.
ట్రాష్ మాట్లాడకండి..
మీరు మీ స్నేహితుడితో గొడవపడ్డప్పుడు మీ భాగస్వామిని సలహా అడగడం వరకు ఓకే.. కానీ వారి గురించి తన దగ్గర చెత్తగా మాట్లాడకండి. ఎందుకంటే వారిద్దరికీ అంతకుముందే చెడింది కాబట్టి.. ఒకవేళ ఆ విడిపోవడం కనక గొడవలతో ముగిస్తే.. వారు చెప్పే తీర్పు మీవైపే ఉంటుంది. అది మీ స్నేహానికి గొడ్డలిపెట్టులా మారుతుంది.
అతిగా ఆలోచించవద్దు
జెలసీని దూరం పెట్టండి. మీ బెస్ట్ ఫ్రెండ్ కు మీ బాయ్ ఫ్రెండ్ కు మధ్య ఇంకా ఏదో ఆకర్షణ ఉందని... వారు విడిపోయినా వారికి ఒకరిమీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయని అనుమానపడొద్దు. దీనివల్ల మీ బంధం దెబ్బతింటుంది.
వారి రిలేషన్‌షిప్‌లోకి వెళ్లవద్దు
మీ బాయ్ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు విడిపోయారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు అనవసరం. ఆ విషయాల్ని కెలకొద్దు. వారి రిలేషన్ ఎందుకు బెడిసికొట్టింది అని కాకుండా మీ బంధం అన్యోన్యంగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించండి.