- Home
- Life
- Food For Liver: ఇదొక్కటి చాలు కాలేయ వ్యాధులను నయం చేయడానికి.. జుట్టును, చర్మాన్ని హెల్తీగా ఉంచడానికి..
Food For Liver: ఇదొక్కటి చాలు కాలేయ వ్యాధులను నయం చేయడానికి.. జుట్టును, చర్మాన్ని హెల్తీగా ఉంచడానికి..
Food For Liver: ఉసిరి కాయ ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. రెగ్యులర్ గా ఉసిరిని తినడం వల్ల కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలెయ వ్యాధులు కూడా పోతాయి.

మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కాలెయం ఒకటి. ఇది మన శరీరంలో ఎన్నో విధులను నిర్వర్తిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి , శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ తొలగించడం, పిత్తాన్ని తయారుచేయడం, రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించేందుకు ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరం కాలెయం సాహాయంతోనే కొవ్వును తగ్గించి , కార్బోహైడ్రేట్లను నిల్వ చేస్తుంది. అయితే ఈ అవయవానికి ఏదైనా సమస్య ఉంటే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల కాలెయం హెల్తీగా ఉండటమే కాకుండా.. కాలెయ అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అవేంటంటే..
ఉసిరి కాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. సాధారణంగా ఉసిరిని మెరిసే చర్మానికి, అందమైన జుట్టుకోసం ఉపయోగిస్తారు. రెగ్యులర్ గా ఉసిరిని తినడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అలాగే చర్మం కూడా నిగనిగలాడుతుంది.
అయితే ఉసిరి ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇది కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది.
রম হবে।
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే వారు ఉసిరిని రోజూ తినాలి. ఇది జీర్ణవ్యవస్థను బలంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి ఔషదం కంటే తక్కువేం కాదు. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల కాలెయం బలంగా మారుతుంది. అలాగే కంటి సమస్యలు, అజీర్థి వంటి సమస్యలు తొలగిపోతాయి.
ఇది ప్రాణాంతకమైన క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిని రెగ్యులర్ గా తినే వారికి గుండెపోటు ప్రమాదం చాలా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది కాలెయ వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది..
ఈ మ్యాజికల్ కాయను తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, హైపర్ లిపిడెమియా వంటి సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉసిరిని ఎలా తీసుకోవాలి?
ఉసిరిని ఎన్నో పద్దతుల ద్వారా తీసుకోవచ్చు. దీన్ని నేరుగా కూడా తినొచ్చు. అయితే కాలెయ సమస్యలున్న వారు మాత్రం ఉసిరిని ఉప్పుతో కలిపి తింటారు. అయితే ఉదయం పూట ఉసిరి టీ తాగితే కాలెయం, ఆరోగ్యం బాగుంటాయి.