MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జుట్టు విపరీతంగా ఊడిపోతోందా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే..

జుట్టు విపరీతంగా ఊడిపోతోందా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే..

జుట్టు బలంగా, ఒత్తుగా పెరగాలంటే జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. వీటితో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాలన్నే తినాలి. అయితే కొన్ని రకాల జ్యూస్ లు హెయిర్ ఫాల్ ను ఆపుతాయి తెలుసా..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 17 2022, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఒకప్పుడు చాలా మందికి నల్లని, ఒత్తైన జుట్టు ఉండేది. ఇప్పుడు పల్చని, సన్నని, బట్టతలలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా ఈ రోజుల్లో ఒత్తైన జుట్టు ఉండటం గగమైపోయింది కూడా. ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, హార్మోన్ల మార్పులు, అనారోగ్య సమస్యలు, మెడిసిన్స్, పోషకాల లోపం, జుట్టును క్లీన్ గా ఉంచుకోకపోవడం వంటివెన్నో జుట్టును ఊడిపోయేలా చేస్తున్నాయి. 
 

28

మీకు తెలుసా.. జుట్టు బలంగా ఉండాలంటే బలమైన ఆహారం తినాలి. అంటే పోషకాలు ఎక్కువగా ఉండే మాంసం, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలి. శరీరంలో విటమిన్ల లోపం లేకుంటేనే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ హెయిర్ ఫాల్ ను ఆపుతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

38

ఉల్లిపాయ రసం

ఉల్లి మన ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లిపాయ రసంతో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టొచ్చు. అంతేకాదు ఈ రసం జుట్టు వేగంగా పెరిగేందుకు, నల్లగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ ముక్కలను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు దానిని జల్లెడలో వేసి వడకట్టండి. ఆ రసంలో దూదిని ముంచి మాడుకు అప్లైం చేయండి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా నీటితో కడిగేయండి. అయితే నెత్తిపై ఉల్లిపాయ వాసన వస్తే.. మైల్డ్ షాంపూను యూజ్ చేయండి. వాసన పోతుంది. 

48

కొబ్బరి నీరు

కొబ్బరి నీటిని తాగడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. వడదెబ్బ కొట్టే ఛాన్స్ కూడా తగ్గుతుంది. అయితే ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. హెయిర్ ఫాల్ ను ఆపడానికి కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపండి. దీన్నినెత్తిమీద అప్లై చేయండి. 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి.  20 నిమిషాల తర్వాత నెత్తిని శుభ్రంగా కడిగేయండి. 

58

కలబంద రసం

కలబంద మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది చర్మానికే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద గుజ్జును తీసి నెత్తికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు రాలడం ఆగిపోయి.. ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 

 

68

వీటితో పాటుగా.. 

జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే పోషాకాలు ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు, గింజలు, చేపలు, మాంసం వంటి వాటిని తరచుగా తినండి. ఇవి మీ జుట్టు ఊడిపోవడం ఆగేలా చేయడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. 
 

78

బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కప్పి ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే జుట్టును అలాగే వదిలేయడం వల్ల దుమ్ము, దూళి వంటివి జుట్టుకు పట్టుకునే అవకాశం ఉంది. వీటివల్ల జుట్టు బలహీనపడుతుంది. దీంతో విపరీతంగా వెట్రుకలు రాలిపోతాయి. 

88

ఒత్తిడి కూడా జుట్టు ఊడిపోయేలా చేస్తుంది. అయినా ఈ కాలంలో ఒత్తిడి లేని మనిషి లేడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ఒత్తిడి ఒక్క జుట్టునే కాదు.. మీ పూర్తి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతే జుట్టు పెరగడం ఆగిపోతుంది. అలాగే జుట్టు విపరీతంగా రాలిపోతుంది కూడా. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా లాంటివి చేయండి. ఇవి ఒత్తిడిని తగ్గించి మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Couple Bracelets: క్యూట్ కపుల్ మ్యాచింగ్ బ్రేస్‌లెట్ డిజైన్లు
Recommended image2
Gold Earrings: అరగ్రాము బంగారంతో చిన్నారికి అదిరిపోయే చెవిపోగులు
Recommended image3
Richest Country: ప్రపంచంలో కుబేరుల దేశం ఇదే.. కానీ ఒక కూకట్ పల్లి కన్నా చిన్నది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved