Tips and Tricks: వర్షాకాలంలో కూరగాయలు కుళ్లిపోకుండా, తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూరగాయలు తడిగా ఉంటాయి. వాటిని మనం అలానే ఫ్రిజ్ స్టోర్ చేయడం వల్ల అవి తొందరగా కుళ్లిపోతూ ఉంటాయి.

కూరగాయలు తాజాగా ఉండాలంటే..
వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మనకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే.. ఈ సీజన్ లో మనకు కూరగాయాలు చాలా తొందరగా కుళ్లిపోతాయనే భయం ఎక్కువగా ఉంటుంది. నిజానికి, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూరగాయలు తడిగా ఉంటాయి. వాటిని మనం అలానే ఫ్రిజ్ స్టోర్ చేయడం వల్ల అవి తొందరగా కుళ్లిపోతూ ఉంటాయి. అందుకే.. ఈ సీజన్ లో పండ్లు, కూరగాయలు నిల్వ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మనం వాటిని ఎక్కువ రోజులు తాజాగా ఉంచగలం. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
KNOW
శుభ్రమైన వస్త్రంతో తుడవాలి...
చాలా మంది మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి, వెంటనే నీటితో శుభ్రం చేస్తారు. ఆపై వాటిని కాసేపు గాలిలో ఆరబెట్టి, ఆ తర్వాత.. వారు వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తారు. కానీ, ఇలా చేయడం తప్పు. కూరగాయలు శుభ్రం చేసిన తర్వాత, మీరు వాటిని కాసేపు ఏదైనా వస్త్రం మీద ఉంచి గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత తడిగా ఉన్న పండ్లు, కూరగాయలను పొడి వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. ఎక్కువ రోజులు కూరగాయలు పాడవకుండా, తాజాగా ఉంటాయి.
గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయాలి...
ఈ రోజుల్లో మనకు ఫ్రిజ్ లో స్పెషల్ గా కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ఎయిర్ టైట్ కంటైనర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్టోర్ చేయడం వల్ల తొందరగా కూరగాయలు, ఆకు కూరలు కూడా పాడవ్వవు. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
మెష్ బుట్టలో నిల్వ చేయండి..
కూరగాయలను ఫ్రిజ్ లో కాకుండా, బయట నిల్వ చేయాలి అనుకుంటే.. మీరు మెష్ బుట్టలో పెట్టొచ్చు. అప్పుడు కూడా కూరగాయలను ఆరబెట్టి, శుభ్రమైన వస్త్రంతో తుడిచి.. ఆ తర్వాత.. మెష్ బుట్టలో నిల్వ చేసుకోవచ్చు. దీని వల్ల కూడా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. తొందరగా కుళ్లిపోవు.
వార్తాపత్రికలో చుట్టండి
వర్షాకాలంలో, ఆకుకూరలు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఈ కూరగాయలను ఎల్లప్పుడూ వార్తాపత్రికలో చుట్టి ఉంచాలి. ఇది ఈ కూరగాయలు త్వరగా కుళ్ళిపోకుండా నిరోధిస్తుంది. దీని వల్ల కూడా అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.