రోజూ 10 గంటలకే పడుకుంటే ఏమౌతుందో తెలుసా?
ఈ కాలంలో తొందరగా నిద్రపోవడమంటే మాటలు కావు. చాలా మంది రాత్రి 11, 12 తర్వాతే నిద్రపోతుంటారు. కానీ మీరు గనుక ప్రతిరోజూ 10 గంటలకే నిద్రపోతే ఎన్నిలాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
sleep
ప్రతి ఒక్కరికీ నిద్ర అవసరం కాదు. అత్యవసరం. ఎందుకంటే నిద్రతోనే మనం ఆరోగ్యంగా ఉంటాం. నిద్రలేకపోతే కొన్ని రోజుల్లోనే ఎన్నో ప్రాణాంతక రోగాల బారిన పడతాం. అందుకే రోజుకు ఏడెనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ ఈ రోజుల్లో కంటినిండా నిద్రపోయేవారు చాలా తక్కువ.
good sleep tips
ముఖ్యంగా రాత్రి ఎంత తొందరగా నిద్రపోతే ఆరోగ్యానికి అంత మంచిది. రాత్రిళ్లు తొందరగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం,శారీరక, మానసిక ఆరోగ్యం, మన జీవనశైలి మెరుగ్గా ఉంటాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ రాత్రిపూల లేట్ గా పడుకుంటే గుండె జబ్బులు, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడతామని డాక్టర్లు చెప్తున్నారు.
కానీ రాత్రి 10 గంటలకు నిద్రపోవడం వల్ల మీరు నమ్మలేని ప్రయోజనాలను పొందుతారు. యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోతే గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అసలు ప్రతిరోజూ రాత్రిపూట 10 గంటలకు నిద్రపోవడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
sleeping
శరీరానికి విశ్రాంతి
రాత్రిపూట తొందరగా నిద్రపోవడం వల్ల మన శరీరానికి మంచి విశ్రాంతి దొరుకుతుంది. నిద్ర మన కండరాలను సడలించి, శరీర కణాలను రిపేర్ చేయడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది. ఒకవేళ మీరు రాత్రిపూట లేట్ గా పడుకుని, లేట్ గా నిద్రలేస్తే గుండె జబ్బులు, డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక వ్యాధులొచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మీరు సమయానికి నిద్రపోతే మాత్రం ఈ వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
బలమైన రోగనిరోధక శక్తి
మంచి నిద్ర మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. కంటినిండా నిద్రపోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మీ శరీరానికి అంటువ్యాధులతో పోరాడే శక్తి అందుతుంది. అలాగే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా తగ్గుతుంది.
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
మంచి నిద్ర మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే బాగా నిద్రపోతే మీ మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతో మీరు కొత్త కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలుగుతారు. మీరు బాగా నిద్రపోతే మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ ఏకాగ్రత సామర్థ్యం కూడా పెరుగుతుంది.
Sleeping
దైనందిన జీవితంలో మార్పులు
మీరు రాత్రి తొందరగా పడుకుంటే ఉదయం తొందరగా నిద్రలేస్తారు. దీనివల్ల మీకు ఉదయం పనులు చేసుకోవడానికి తగిన సమయం అందుతుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మంచి నిద్ర మీ ఆలోచన అభివృద్ధిని పెంచుతుంది. దీంతో మీరు నిర్ణయాలను బాగా ఆలోచించి తీసుకుంటారు. నిద్రతో ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది.