Almond Face Packs: బాదం ఫేస్ ప్యాక్ తో అదిరిపోయే అందం మీ సొంతం..
Almond Face Packs: బాదం ఫేస్ ప్యాక్ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా అందాన్ని ఇది రెట్టింపు చేస్తుంది..

బాదం పప్పుల్లో (almond pulses) విటమిన్ ఇ, జింక్ (Zinc), సెలీనియం (Selenium),వంటివి పుష్కలంగా ఉంటాయి. అందులో విటమిన్ ఇ, రెటినాల్ యొక్క గొప్ప మూలం. ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తాయి. ఇది మీ ముఖంపై ముడతలు (Wrinkles), ఫైన్ లైన్ల (Fine lines)ను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.
మొటిమలు (Acne), బ్లాక్ హెడ్స్ (Blackheads), వైట్ హెడ్స్ (Whiteheads)ను తగ్గించడంలో కూడా బాదం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నూనె స్రావం దానిలో ఉండే కొవ్వు ఆమ్లాల సహాయంతో ఈ సమస్యలను నియంత్రిస్తుంది.
బాదం ఫేస్ ప్యాక్ మొటిమల వల్ల కలిగే మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ముఖం యొక్క రంగును, ముఖాన్ని ప్రకాశవంతంగా తయారుచేయడానికి బాదంతో తయారు చేసిన మూడు రకాల ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
బాదం పప్పులను డైరెక్ట్ గా గ్రైండ్ చేసి అందులో కాస్త తేనెను కలిపి డైరెక్ట్ గా మీ ముఖానికి అప్లై చేయవచ్చు. దీన్ని ముఖానికి రాసిన తర్వాత బాగా ఆరినివ్వాలి. ఆ తర్వాత నీట్ గా కడిగేయాలి. ఇది ముఖ రంగును మార్చడమే కాదు.. ముఖాన్ని మరింత ప్రకాశవంతంగా తయారుచేస్తుంది కూడా.
బాదం ఓట్స్ ఫేస్ ప్యాక్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం ఓట్స్ ఫేస్ ప్యాక్ చర్మం పొడిబారడాన్ని తొలగించడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా, రంగును పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం బాదం పొడి, ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అది ఆరిన తరువాత చల్లటి నీటితో కడగాలి.
అందం సంరక్షణకు పెరుగు, బాదంపప్పు అందించే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కావు.. ఇది చర్మానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందకోసం.. బాదం పప్పులను గ్రైండ్ చేసి పెరుగులో వేసి బాగా కలగలపాలి. దీన్ని మెడ, ముఖానికి అప్లై చేసుకోవచ్చు. పెరుగు, బాదంపప్పులను చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి లేదా.. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు.