MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Afternoon nap: మధ్యాహ్నం కునుకు తీసే అలవాటు ఉందా? మీ లైఫ్ లో జరిగేది ఇదే..!

Afternoon nap: మధ్యాహ్నం కునుకు తీసే అలవాటు ఉందా? మీ లైఫ్ లో జరిగేది ఇదే..!

Afternoon nap: నిద్ర అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం. అయితే.. మధ్యాహ్నం నిద్ర అసలు మనకు అవసరమా? 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Apr 16 2026, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Afternoon sleep
Image Credit : chat gpt

Afternoon sleep

ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో... నిద్ర కూడా అంతే ముఖ్యం.కనీసం ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర ప్రతి వ్యక్తికి అవసరం. అయితే, నేటి బిజీ లైఫ్ స్టైల్ లో, రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం వల్ల చాలా మంది మధ్యాహ్న సమయంలో నిద్రపోయే అలవాటు మార్చుకున్నారు. కానీ, చాణక్య నీతి ప్రకారం మధ్యాహ్న నిద్ర పోవడం మంచిదేనా? చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  మధ్యాహ్నం నిద్ర అశుభం:
Image Credit : Getty

మధ్యాహ్నం నిద్ర అశుభం:

చాణక్యుని నితి శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం నిద్రపోయేవారు తమ ఉత్సాహాన్ని, శక్తిని కోల్పోతారు. బలహీనపడిపోతారు. వారిలో ఉత్సాహం సన్నగిల్లుతుంది. అంతేకాదు.. ఆయుష్షు కూడా తగ్గుతుంది. నిద్ర సమయంలో శరీర శ్వాస క్రియ రేటు పెరుగుతుంది. తద్వారా పగటిపూట శరీరానికి అవసరమయ్యే శక్తి వృథా అవుతుంది,

నిద్ర, శారీరక సమతుల్యత..

చాణక్యుని ప్రకారం పగటిపూట నిద్రించడం శరీరంలోని సహజ శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రకృతి నియమాల ప్రకారం, పగటి సమయం పని కోసం, రాత్రి సమయం విశ్రాంతి విశ్రాంతికి కేటాయించారు. దీనికి వ్యతిరేకంగా ఫాలో అయితే.. ప్రకృతిలోని వ్యతిరేక శక్తులను మేల్కున్నవారు అవుతారు.ఫలితంగా వారి శరీరక, మానసిక సామర్థ్యాలు క్షీణిస్తాయి.ఇలా నిద్రపోయే వారికి పని పట్ల ఆసక్తి ఉండదు.

33
వైద్యులు ఏం చెబుతున్నారు?
Image Credit : Getty

వైద్యులు ఏం చెబుతున్నారు?

చాణక్యుడు చెప్పిన విషయాన్ని చాలా మంది వైద్యులు కూడా అంగీకరించారు. నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాలపాటు కాసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది. కానీ పగటి పూట 2 నుంచి 3 గంటల పాటు నిద్రపోవడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మధ్యాహ్న నిద్ర కారణంగా చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని చాలా అధ్యాయనాలు చెబుతున్నాయి.

మానసిక ప్రభావం, ప్రతికూల శక్తి...

మధ్యాహ్నం నిద్రించే అలవాటు కేవలం శరీరంపైనే కాకుండా, మనసుపై కూడా ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తర్వాత.. అలసట ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అంతేకాదు.. తర్వాత ఏ పనీ సరిగా చేయలేరు కూడా. అంతేకాదు.. మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోవడం వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. దీని వల్ల మొత్తం స్లీప్ సైకిల్ పాడైపోతుంది.

చాణక్యుని దృష్టిలో, మధ్యాహ్నం నిద్రించడం ఒక అశుభ సూచకం. అయితే, నేటి శాస్త్రం ప్రకారం, మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవడం హానికరం కాదు. కాబట్టి, మధ్యాహ్న నిద్రను పూర్తిగా మానుకోవడానికి బదులుగా, దానిని ఒక నిర్దిష్ట సమయానికి పరిమితం చేసుకొని తీసుకోవడం శ్రేయస్కరం. నిద్ర, పని , క్రమశిక్షణ.. ఈ మూడింటి మధ్య సమతుల్యత పాటించడమే ఆరోగ్యం, విజయాలకు నిజమైన మార్గం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Pomegranate:30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలు వేరే చేసే టెక్నిక్ ఇది..!
Recommended image2
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved