- Home
- Life
- Hair Growth: జుట్టు పొట్టిగా ఉందని బాధపడుతున్నారా? వీటిని తినండి.. చాలా ఫాస్ట్ గా మీ జుట్టు పెరుగుతుంది..
Hair Growth: జుట్టు పొట్టిగా ఉందని బాధపడుతున్నారా? వీటిని తినండి.. చాలా ఫాస్ట్ గా మీ జుట్టు పెరుగుతుంది..
Hair Growth Tips: ఒత్తైన, పొడవైన జుట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టైతే వెంటనే మీ డైట్ లో ఈ ఆహార పదార్థాలను చేర్చుకోండి.

ఇతర కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో జుట్టును మరింత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే వర్షంలో జుట్టు తరవడం వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోవడం, చిట్లిపోవడం, నిర్జీవంగా మారడం, జిడ్డుగా తయారవడం, చుండ్రు వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఈ కారణాల వల్ల చాలా మంది జుట్టు చాలా చిన్నదిగా మారిపోతుంది. క ఈ జుట్టును పొడుగ్గా చేసేందుకు మార్కెట్ లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలను వాడుతుంటారు. వీటివల్ల జుట్టు పెరగడం సంగతి పక్కన పెడితే.. ఉన్నది కాస్త ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.
ముందే అమ్మాయిలకు జుట్టంటే మహా ప్రాణం. అందులోనూ జుట్టుతోనే అందం. అలాంటి జుట్టు విషయంలో కేరింగ్ చాలా అవసరం. అయితే కొన్ని కెమికల్స్ షాంపూలు, నూనెల జోలికి వెల్లకుండా.. కొన్ని రకాల ఆహారాలను తింటే కూడా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు పెరిగేందుకు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరి (amla)
ఉసిరిలో విటమిన్ సి తో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు కూడా సహాయపడుతాయి. అంతేకాదు ఉసిరి ముఖ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు హెయిర్ ఫాల్ సమస్యను తొలగిస్తుంది.
అవిసె గింజలు (Flax seeds)
అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది హెయిర్ ఫాల్ సమస్య ను తొలగించడంతో పాటుగా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది.
కరివేపాకు (curry leaves)
కరివేపాకులో విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాదు జుట్టు పెరగడానికి కూడా సహాయపడతాయి. అందుకే కూరల్లో కరివేపాకును తీసి పారేయకండి.
avocado
అవకాడో (Avocado)
అవొకాడో మన దేశంలో పండకపోయినా.. వీటి వాడకం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ జుట్టు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
గుడ్లు (Eggs)
గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాదు జుట్టు ఎదుగుదలకు కూడా ఎంతో సహాయపడతాయి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.