MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Okra Cooking Tips: బెండకాయ వేపుడు జిగురుగా కాకుండా పొడిపొడిగా వచ్చేందుకు సింపుల్ చిట్కాా

Okra Cooking Tips: బెండకాయ వేపుడు జిగురుగా కాకుండా పొడిపొడిగా వచ్చేందుకు సింపుల్ చిట్కాా

Okra Cooking Tips: బెండకాయ అనగానే జిగురే గుర్తొస్తుంది. వేపుడు చేద్దామంటే జిగురులా అనిపిస్తుంది. ఎంత బాగా వండినా కూర ముద్దగా అయిపోతుంది.  హోటళ్లలో మాత్రం బెండకాయ ఫ్రై పొడిపొడిగా వస్తుంది. అలా రావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 30 2026, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బెండకాయ పొడిపొడిగా, కరకరలాడాలంటే..
Image Credit : Getty

బెండకాయ పొడిపొడిగా, కరకరలాడాలంటే..

బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బెండకాయ కోసేటప్పుడే  జిగురుగా అనిపిస్తుంది. ఇది చాలామందికి చికాకు తెప్పిస్తుంది. ఈ జిగురు వల్ల వేపుడు పొడి పొడిగా కూడా రాదు. దీని వల్ల రుచి పోతుంది. బెండకాయ  ముక్కలన్నీ అతుక్కుపోయి ముద్దలా వేపుడు వస్తుంది. ఇకపై  బెండకాయ వేపుడు పొడిపొడిగా రావాలంటే హోటల్ స్టైల్‌లో ఈ అద్భుతమైన చిట్కాలను ఫాలో అవ్వండి. 

25
తడి లేకుండా
Image Credit : our own

తడి లేకుండా

బెండకాయలను కడిగిన వెంటనే తరగవద్దు. కడిగాక వాటిని పొడి బట్టతో తుడిచి  ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టండి. నీటి తడి ఉంటే కోసినప్పుడు బెండకాయల నుంచి జిగురు ఎక్కువగా వస్తుంది. అలాగే, బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కోస్తే జిగురు ఎక్కువగా వస్తుంది. అందుకే ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి.

Related Articles

Related image1
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఎప్పుడు? బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఏది?
Related image2
Top 5 Budget Cars: రూ.6 లక్షల లోపు వచ్చే టాప్ 5 ఫ్యామిలీ కార్లు ఇవిగో, లగ్జరీగా కనిపిస్తాయి
35
నిమ్మరసం లేదా పెరుగు
Image Credit : chatgpt.com

నిమ్మరసం లేదా పెరుగు

బెండకాయలు వేపుడు చేయాలంటే కూర వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం, ఆమ్‌చూర్ పౌడర్ లేదా పెరుగు కలపండి. అవును కూర మగ్గుతున్నప్పుడు ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా ఒక చెంచా పెరుగు వేస్తే, వాటిలోని ఆమ్ల గుణం (acid) బెండకాయ జిగురును వెంటనే పోతుంది.

45
ఉప్పును చివర్లో వేయండి
Image Credit : Pixabay

ఉప్పును చివర్లో వేయండి

చాలామంది వంట మొదట్లోనే ఉప్పును వేసి కలిపేస్తారు.  కానీ బెండకాయ వేపుడు లేదా కూర వండినప్పుడు మాత్రం ముందుగా ఉప్పు వేయకూడదు.  ఉప్పు వేయడం వల్ల తేమను విడుదల చేసి జిగురును పెంచుతుంది. అందుకే కూర 90 శాతం ఉడికిన తర్వాతే ఉప్పును వేయండి.  అలాగే కళాయి నిండా ముక్కలు వేయొద్దు. గాలి ఆడేంత ఖాళీ ఉండేలా చూసుకోండి. 

55
మూత పెట్టకండి
Image Credit : our own

మూత పెట్టకండి

బెండకాయ వేపుడు చేసేటప్పుడు బాణలిపై మూత పెట్టకూడదు. మూత పెడితే కూర ముద్దగా మారుతుంది. దీనివల్ల ముక్కలు మెత్తబడి జిగురు వస్తుంది. అందుకే మూత తీసే వండండి. బెండకాయలు వేసిన తర్వాత పదేపదే గరిటెతో తిప్పకండి. ఎక్కువగా కలిపితే ముక్కలు విరిగిపోయి, గింజలు, జిగురు బయటకు వస్తాయి.

బెండకాయలు కోసేటప్పుడు కత్తికి  కొద్దిగా నిమ్మరసం రాయండి. దీనివల్ల కోసేటప్పుడు కత్తికి జిగురు అంటుకోదు. పని కూడా చకచకా అయిపోతుంది!

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jasmine: రాత్రిపూట మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలి?
Recommended image2
Baby Gold Chains: రెండు గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్ డిజైన్లు
Recommended image3
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఎప్పుడు? బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఏది?
Related Stories
Recommended image1
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఎప్పుడు? బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఏది?
Recommended image2
Top 5 Budget Cars: రూ.6 లక్షల లోపు వచ్చే టాప్ 5 ఫ్యామిలీ కార్లు ఇవిగో, లగ్జరీగా కనిపిస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved