Telugu

వానాకాలంలో ఇలా స్పెషల్ మసాలా చాయ్ చేసి తాగితే ఉంటుందీ...

Telugu

వర్షాకాలంలో స్ట్రాంగ్ టీ.. ఎలా చేయాలో చూడండి

వానలు పడుతున్నప్పుడు వేడివేడిగా, ఘాటుగా మసాలా చాయ్ తాగితే ఆ అనుభూతే వేరు. దీన్ని చాలా సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది.
Image credits: freepik
Telugu

కావాల్సిన పదార్థాలు

నీళ్లు – 1 కప్పు, పాలు – ½ కప్పు, టీ పౌడర్ – 2 టీస్పూన్లు, చక్కెర – 1.5 టీస్పూన్లు, అల్లం – ½ అంగుళం తురిమిన ముక్క, యాలకులు – 1, లవంగం / దాల్చినచెక్క పొడి – చిటికెడు.

Image credits: freepik
Telugu

నీళ్లు మరిగించి మసాలా ఫ్లేవర్ రప్పించాలి

ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లు పోసి మరిగించండి. అందులో తురిమిన అల్లం, యాలకులు, లవంగం, దాల్చినచెక్క వేయాలి. 3–4 నిమిషాల పాటు బాగా మరిగిస్తే, మసాలాల ఫ్లేవర్ నీటిలోకి దిగుతుంది.

Image credits: pinterest
Telugu

ఇప్పుడు టీ పౌడర్ వేయాలి

మరుగుతున్న నీటిలో టీ పౌడర్ వేయండి. మరో 2-3 నిమిషాల పాటు మరిగించాలి. టీకి మంచి రంగు, సువాసన రావాలంటే ఈ టైమ్ ఇవ్వడం ముఖ్యం.

Image credits: pinterest
Telugu

పాలు, చక్కెర వేసి మరిగించాలి

ఇప్పుడు పాలు, చక్కెర వేసి మరో 3-4 నిమిషాలు మరిగించండి. మంట తగ్గించి, గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే టీకి చిక్కటి రంగు, ఘాటైన రుచి, మంచి వాసన వస్తాయి.

Image credits: pinterest
Telugu

వడకట్టి వేడివేడిగా సర్వ్ చేయండి

టీని వడకట్టి కప్పుల్లో పోయండి. వర్షం పడుతుంటే.. వేడివేడి బజ్జీలు లేదా బిస్కెట్లతో ఈ చాయ్ తాగితే ఆ మజాయే వేరు!

Image credits: freepik
Telugu

చిట్కా

వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి అల్లం, యాలకులు ఉపశమనం కలిగిస్తాయి. అందుకే ఈ మసాలా చాయ్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెసిపీ.

Image credits: freepik

Moringa Benefits: ఈ ఆకుకూరలో ఉన్నన్ని పోషకాలు మరెందులోనూ ఉండవు

Poori: హోటల్ స్టైల్ లో పూరీలు బాగా పొంగాలంటే ఇదొక్కటి చేస్తే చాలు

Carabao Mango : ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఇదే!

Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..