MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Khushbu: స్క్రీన్ మీద చూసి షాకయ్యా..38 కిలోలు తగ్గిన సీనియర్ హీరోయిన్, వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే

Khushbu: స్క్రీన్ మీద చూసి షాకయ్యా..38 కిలోలు తగ్గిన సీనియర్ హీరోయిన్, వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే

Khushbu: బరువు తగ్గాలంటే నచ్చిన ఫుడ్ మానేయాలా? డైట్ అంటే ఇష్టమైనవి తినకూడదనే సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ నచ్చింది తింటూనే భారీగా వెయిట్ లాస్ అవ్వొచ్చని సీనియర్ హీరోయిన్, పొలిటీషియన్ ఖుష్బు చెబుతున్నారు. ఆమె వెయిట్ లాస్ జర్నీ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 25 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
38 కిలోల బరువు తగ్గిన ఖుష్బూ
Image Credit : khushsundar/ Instagram

38 కిలోల బరువు తగ్గిన ఖుష్బూ

బరువు తగ్గాలన్నా, స్లిమ్ గా ఉండాలంటే నచ్చిన ఫుడ్ మానేయాలని అనుకుంటారు. డైట్ అంటే ఇష్టమైనవి తినకూడదని వాటికి దూరంగా ఉంటారు. కానీ ఇది కొంచెం కష్టమైన పనే. కాకపోతే చాలా మందికి డైట్ విషయంలో బోలెడు సందేహాలు ఉంటాయి. అయితే ఇవేవీ చేయకుండానే కిలోల కొద్దీ బరువు తగ్గొచ్చని సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ చెబుతున్నారు. అంతేకాదు ఆమె తనకు నచ్చిన ఫుడ్ తింటూనే 38 కిలోల బరువు తగ్గారట. మరి ఆమె ఎలా బరువు తగ్గారో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నియంత్రణ చాలా అవసరం
Image Credit : khushsundar/ Instagram

నియంత్రణ చాలా అవసరం

ఖుష్బూ వెయిట్ లాస్ జర్నీలో అందరిలా కాకుండా కొత్త విధానాన్ని అనుసరించారు. తనకు ఇష్టమైన బిర్యానీ, స్వీట్లు, ఐస్ క్రీం, టీ, కాఫీ లు పూర్తిగా మానేయకుండా తినే క్వాంటిటీ తగ్గించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇలా నాలుగేళ్లలో దాదాపు 38 కిలోల బరువు తగ్గినట్లు ఆమె వెల్లడించారు.

35
ఆ సినిమాలో చూసి భయపడ్డా
Image Credit : khushsundar/ Instagram

ఆ సినిమాలో చూసి భయపడ్డా

ఒకప్పుడు ఖుష్బూ దాదాపు 100 కిలోలు ఉండేవారు. ఓ సినిమాలో రజనీకాంత్ తో కలిసి నటించిన సమయంలో స్క్రీన్ మీద తనను తాను చూసుకుని ఆశ్చర్యపోయారట. అది నేనేనా అని అనుకున్నారట. దానికి తోడు మోకాళ్ల నొప్పి కూడా మొదలైంది. దీంతో అప్పటి నుంచి ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ఖుష్బూ చెబుతున్నారు. తన ఇంట్లో భర్త, పిల్లలు అప్పటికే యోగా, జిమ్ చేస్తుండగా వాళ్లను చూసి ఇన్ స్పైర్ అయి తాను కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని అనుకున్నారట. అయితే అలా నాలుగేళ్ల పాటు ఫుడ్, జిమ్ పై దృష్టి పెట్టి 38 కిలోల వరకూ తగ్గారు.

45
జిమ్ కు వెళ్లను
Image Credit : khushsundar/ Instagram

జిమ్ కు వెళ్లను

బరువు తగ్గే క్రమంలో ఇష్టమైన ఫుడ్ ని వదులుకోలేదు ఖుష్బూ. తనకి మటన్ బిర్యానీ అంటే బాగా ఇష్టమట. అందుకే పూర్తిగా మానేయకుండా ఒక బౌల్ మటన్ బిర్యానీతో కేవలం ఒక ముక్క మాత్రమే తినేవారట. శరీరానికి ఎంత అవసరమో అంతే తినేవారు. స్వీట్లు, ఐస్ క్రీం, టీ, కాఫీ విషయంలో చాలా లిమిటేడ్ గా ఉంటూ బరువు తగ్గారు.

ఇంకో విషయం ఏమిటంటే...ఖుష్బూకు జిమ్ కు వెళ్లడం ఇష్టం లేదట. అందుకే ఇంట్లో యోగా, వాకింగ్, ఇతర వ్యాయామాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రోజూ చేస్తూ ఉండగా కొన్ని రోజులకు శరీరంలో మార్పులు, జుట్టులో కూడా మార్పులు రావడంతో ఉత్సాహంగా అనిపించిదన్నారు.

55
ఇదే నా వెయిట్ లాస్ జర్నీ
Image Credit : khushsundar/ Instagram

ఇదే నా వెయిట్ లాస్ జర్నీ

బరువు తగ్గడం ఎంత కష్టమో...దాన్ని అలానే మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం. అందుకే మితంగా తింటూ ఎప్పుడు తినాలి, ఎంత తినాలి,ఎప్పుడు ఆపాలి అనే విషయంలో రూల్స్ పెట్టుకున్నట్లు ఖుష్బూ తెలిపారు. చాలామంది ఆకలికి కాకుండా నాలుకకు నచ్చిన రుచిని బట్టి ఎక్కువగా తింటుంటారని ఖుష్బూ పేర్కొన్నారు. తన విషయంలో మాత్రం శరీరానికి ఎంత అవసరమో అర్థం చేసుకోవడం కీలకంగా మారిందని తెలిపారు. చిన్న పరిమాణాల్లో ఆహారం తీసుకోవడం, మితంగా తినడం, క్రమం తప్పకుండా కదలడం, నిరంతరంగా అలవాట్లను కొనసాగించడం.. ఇవే తన వెయిట్ లాస్ జర్నీ అని ఆమె వివరించారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఈ ఐదు తింటే... ఒక్క వెంట్రుక కూడా రాలదు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
Recommended image2
Paneer: ఇంట్లో చేసిన పనీర్ ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలంటే ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి
Recommended image3
Cake Recipe: మీ ఇంట్లోని ఇడ్లీ పాత్రలోనే మెత్తటి కేక్ ఇలా చేసేయండి
Related Stories
Recommended image1
Paneer: ఇంట్లో చేసిన పనీర్ ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉండాలంటే ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి
Recommended image2
Now Playing
Gold Price Today : నిన్న ఊరట.. ఇవాళ మళ్లీ షాకిచ్చిన పసిడి.. బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved