Kitchen Tips: కిచెన్‌లో స్థలం సరిపోవడం లేదా? ఇలా ఖర్చు లేకుండా స్పేస్ క్రియేట్ చేసుకోండి
Kitchen Tips: ఎంత తగ్గిద్దామన్నా కిచెన్ లో సామానులకు ప్లేసే చాలదు. దాని కోసం ఆన్ లైన్ లో కనిపించే ప్రతీ వస్తువు కొనేయాలని అనుకుంటారు. దాని వల్ల డబ్బు వృథా. సో ఎలాంటి ఖర్చు లేకుండా ఉన్న కొద్ది స్థలాన్నే స్మార్ట్‌గా వాడుకునేందుకు 7 టిప్స్ చూద్దాం.

కిచెన్ లో ప్లేస్ సేవ్ చేయడమెలా?
ఎంత తగ్గిద్దామన్నా కిచెన్ లో సామానులకు ప్లేసే చాలదు. దాని కోసం ఆన్ లైన్ లో కనిపించే ప్రతీ వస్తువు కొనేయాలని అనుకుంటారు. దాని వల్ల డబ్బు వృథా. వంటగది చిన్నగా ఉన్నప్పుడు గిన్నెలు, సరుకులు, మసాలా డబ్బాలు సర్దుకోవడం పెద్ద టాస్క్. కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద సామాన్లు నిండిపోతే వంట చేయడం కూడా కష్టమే. దీనికోసం కొత్తగా షెల్ఫ్‌లు కట్టించాల్సిన పనిలేదు. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు. ఉన్నవాటినే సరిగ్గా సర్దుకోవడం, వాడనివి పక్కన పెట్టడం ద్వారా కిచెన్‌ను నీట్‌గా మార్చుకోవచ్చు.
కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద అనవసరమైన వస్తువులు పెట్టొద్దు!
మిక్సీ, అప్పుడప్పుడూ వాడే వస్తువులు, ఖాళీ డబ్బాలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద ఉంచితే వంట చేయడానికి స్థలం ఉండదు. రోజూ వాడే వస్తువులను మాత్రమే ప్లాట్‌ఫామ్ మీద పెట్టుకోండి. మిగతావి షెల్ఫ్‌లలో సర్దుకోండి.
వంట పూర్తయ్యాక ప్లాట్‌ఫామ్ క్లీన్ చేసి, వస్తువులను వాటి స్థానంలో పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల వంటగది చూడటానికి నీట్‌గా ఉంటుంది, వంట చేయడానికి కావాల్సినంత ప్లేస్ దొరుకుతుంది.
డబ్బాలు, వాటి మూతలు కలిపి ఒకేచోట పెట్టండి!
వంటగదిలో ప్లాస్టిక్ లేదా స్టీల్ గిన్నెలు ఎక్కువగా ఉంటే, ఒకదానిలో ఒకటి పెట్టి సర్దుకోండి. ఒకే సైజు డబ్బాలను విడివిడిగా పెట్టే బదులు, చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఒకదానిలో ఒకటి పెడితే చాలా స్థలం కలిసొస్తుంది.
డబ్బాల మూతలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, వాటన్నింటినీ ఒకే బాక్స్‌లో పెట్టుకోండి. అప్పుడు మీకు కావాల్సిన డబ్బా, దాని మూత ఈజీగా దొరుకుతాయి. విరిగిపోయినవి, మూతలు లేనివి పడేయండి.
ఎత్తైన షెల్ఫ్‌లలో బుట్టలను వాడండి!
కిచెన్ షెల్ఫ్‌లలో మసాలా ప్యాకెట్లు, సరుకులు, గిన్నెలు అన్నీ కలిపేస్తే.. కావాల్సిన వస్తువు వెతుక్కోవడానికే టైమ్ సరిపోతుంది. వీటిని విడివిడిగా సర్దుకోవడానికి సరైన సైజులో ఉండే స్టోరేజ్ బుట్టలను వాడండి.
బేకింగ్ వస్తువులు, టీ, కాఫీ పొడులు, అప్పుడప్పుడూ వాడే వస్తువులకు వేర్వేరు బుట్టలు పెట్టుకోండి. ఎత్తైన షెల్ఫ్‌లలో వస్తువులు తీయడానికి, పెట్టడానికి ఈ బుట్టలు బాగా ఉపయోగపడతాయి. త్వరగా పాడవని, క్లీన్ చేయడానికి ఈజీగా ఉండే బుట్టలను ఎంచుకోండి.
రోజూ వాడే వస్తువులను దగ్గరగా పెట్టుకోండి!
రోజూ వాడే ఉప్పు, కారం, పసుపు లాంటి మసాలా డబ్బాలను, గరిటెలు, చాకులు లాంటివి చేతికి అందే దూరంలో పెట్టుకోండి. అప్పుడప్పుడూ వాడే వస్తువులను ఎత్తైన లేదా దూరంగా ఉన్న షెల్ఫ్‌లలో సర్దుకోండి.
దీనివల్ల ప్రతిసారీ డబ్బాలన్నీ కదపాల్సిన పని ఉండదు. స్టవ్‌కు దగ్గరగా మంట అంటుకునే వస్తువులు, వేడికి పాడయ్యే సరుకులు అస్సలు పెట్టకండి. కిచెన్‌లో సేఫ్ అయిన ప్లేస్‌ను ఎంచుకుని వస్తువులను సర్దుకోండి.
షెల్ఫ్‌ల కొలతలు చూసుకోండి; వస్తువులన్నీ ఒకేచోట కుక్కకండి!
స్టోరేజ్ బుట్టలు లేదా ర్యాక్‌లు కొనేముందు, మీ షెల్ఫ్ వెడల్పు, లోతు, ఎత్తు కొలుచుకోండి. సైజు సరిపోని బుట్టలు కొంటే, అవి షెల్ఫ్‌లో పట్టక మరింత స్థలాన్ని ఆక్రమిస్తాయి.
అలాగే, గిన్నెలన్నీ ఒకే షెల్ఫ్‌లో కుక్కేయకుండా, వాడే అవసరాన్ని బట్టి విడదీయండి. రోజూ వాడే ప్లేట్లు, గిన్నెలు ఒకవైపు.. పెద్ద గిన్నెలు, అప్పుడప్పుడూ వాడేవి మరోవైపు పెట్టుకోండి. షెల్ఫ్ ఎత్తును పూర్తిగా వాడుకోవడానికి ర్యాక్‌లు ఉపయోగపడతాయి. కానీ అవి కరెక్ట్‌గా ఫిట్ అయ్యాయో లేదో చూసుకోండి.
కొత్త వస్తువులు కొనేముందు ఈ పని చేయండి!
వంటగదిలో స్థలం సరిపోవట్లేదంటే, ముందుగా షెల్ఫ్‌లన్నీ ఒకసారి చెక్ చేయండి. చాలా రోజులుగా వాడని గిన్నెలు, అవసరానికి మించి ఉన్న డబ్బాలు, ఎక్స్‌పైరీ అయిపోయిన సరుకులను పక్కన పెట్టేయండి. పాడైపోయినవి పడేసి, వాడేవాటిని మాత్రమే నీట్‌గా సర్దుకోండి.
ఒకే రకమైన వస్తువులను ఒకచోట చేర్చి, వాటికంటూ ఒక స్థిరమైన ప్లేస్ కేటాయించండి. కొత్త స్టోరేజ్ వస్తువులు కొనాలనుకుంటే, నిజంగా ఏ సమస్యను పరిష్కరించాలో ముందుగా డిసైడ్ అవ్వండి. ఇలా చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గించుకుని, ఉన్న స్థలాన్నే స్మార్ట్‌గా వాడుకోవచ్చు.

