MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Parenting: మీరు మంచి పేరెంట్స్‌గా ఉండాలంటే రోజూ ఈ 5 పనులు చేస్తే చాలు!

Parenting: మీరు మంచి పేరెంట్స్‌గా ఉండాలంటే రోజూ ఈ 5 పనులు చేస్తే చాలు!

Parenting: పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. మంచి స్కూల్, చదువు, సౌకర్యాలు కల్పించడానికి ఎంతగానో కష్టపడతారు. నిజానికి పిల్లలకు ఏం కావాలి? అసలు మంచి పేరెంట్స్‌గా ఉండాలంటే ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 14 2026, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లల పెంపకం చిట్కాలు
Image Credit : gemini ai

పిల్లల పెంపకం చిట్కాలు

పిల్లలను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం ప్రతి తల్లిదండ్రుల కల. అయితే మంచి పేరెంట్‌గా ఉండాలంటే ఖరీదైన బహుమతులు కొనివ్వడం, మంచి స్కూల్లో చేర్పించడం మాత్రమే సరిపోదు. ప్రతి రోజు కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తే పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో మెరుగుపడుతుంది. నిపుణుల ప్రకారం పిల్లల కోసం పేరెంట్స్ చేయాల్సిన 5 పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పిల్లలతో గడపడం
Image Credit : Getty

పిల్లలతో గడపడం

ప్రతి రోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలైనా పిల్లలతో పూర్తిగా గడపాలి. ఈ సమయంలో మొబైల్ ఫోన్, టీవీ లేదా ఇతర పనులను పక్కన పెట్టి కేవలం పిల్లలపైనే దృష్టి పెట్టాలి. వారు స్కూల్లో ఏం నేర్చుకున్నారు, స్నేహితులతో ఎలా గడిపారు, ఏ విషయం వారికి ఆనందం కలిగించింది.. లేదా ఏది బాధ పెట్టింది? వంటి విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఇలా మాట్లాడటం వల్ల పిల్లలకు తల్లిదండ్రులపై నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా అమ్మా నాన్నలతో పంచుకోవాలనే భావన ఏర్పడుతుంది.

36
పిల్లలను ప్రశంసించడం
Image Credit : Getty

పిల్లలను ప్రశంసించడం

చాలామంది పేరెంట్స్ పిల్లలు తప్పు చేసినప్పుడు మాత్రమే గమనిస్తారు. కానీ వారు చేసిన మంచి పనులను కూడా గుర్తించి అభినందించాలి. చిన్న సహాయం చేసినా, చదువులో మంచి మార్కులు తెచ్చుకున్నా, మంచి ప్రవర్తన చూపించినా.. నువ్వు బాగా చేశావ్, చాలా బాగా ట్రై చేశావ్.. వంటి మాటలు చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమిని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంటారు.

46
ఆదర్శంగా ఉండడం
Image Credit : gemini ai

ఆదర్శంగా ఉండడం

పేరెంట్స్ చేసే పనులు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే పేరెంట్స్ ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడటం, టైంకి పనులు పూర్తి చేయడం, నిజాయతీగా ఉండటం వంటి అలవాట్లు పిల్లలు గమనిస్తారు. మీరు కోపాన్ని ఎలా నియంత్రిస్తున్నారో, ఇతరులను ఎలా గౌరవిస్తున్నారో కూడా వారు చూసి నేర్చుకుంటారు.

56
పిల్లల భావాలను అర్థం చేసుకోవడం
Image Credit : Getty

పిల్లల భావాలను అర్థం చేసుకోవడం

కొన్నిసార్లు పిల్లలు కోపంగా ఉండవచ్చు, ఏడవవచ్చు లేదా మౌనంగా ఉండవచ్చు. అలాంటి టైంలో వెంటనే మందలించడం కంటే, ఏమైంది?, నీకు ఏదైనా ఇబ్బందిగా ఉందా? అని ప్రశాంతంగా మాట్లాడాలి. వారి భావాలను చిన్నచూపు చూడకుండా వినాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయడం నేర్చుకుంటారు.

66
కుటుంబం మొత్తం..
Image Credit : Getty

కుటుంబం మొత్తం..

ప్రస్తుత బిజీ లైఫ్ లో అందరూ ఒకే టేబుల్ వద్ద కూర్చొని మాట్లాడుకునే సమయం చాలా విలువైనది. అలాంటి సమయంలో ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకుండా ఒకరి మాటలు మరొకరు వినాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు కుటుంబం ఎప్పుడూ తమకు అండగా ఉంటుందనే భరోసా పిల్లల్లో కలుగుతుంది. మంచి పేరెంట్‌గా మారడం ఒక్క రోజులో జరిగే విషయం కాదు. ప్రతి రోజు చిన్న చిన్న మార్పులు చేస్తూ ముందుకు సాగితే పిల్లల జీవితంలో గొప్ప మార్పులు కనిపిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Cooking: కుక్కర్‌లో వండిన అన్నం మంచిదా? లేక వార్చి వండినది ఆరోగ్యకరమా?
Recommended image2
Bracelet Designs: అమ్మాయిల చేతులకు అందాన్ని తెచ్చే బ్రేస్లేట్ డిజైన్లు
Recommended image3
Smart Kitchen Gadgets: కిచెన్ లో పని తగ్గించే అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్స్..క్షణాల్లో మీ పనులు కంప్లీట్
Related Stories
Recommended image1
Parenting: మగపిల్లల పెంపకంలో ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు! చేస్తే ఇబ్బందులు తప్పవు!
Recommended image2
Parenting: తల్లిదండ్రులు పిల్లలకు పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved