MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Hormonal Imbalance in Men: టెస్టోస్టెరాన్ తగ్గుతోందా? బాడీ ఇచ్చే ఈ 5 సిగ్నల్స్ గుర్తించండి

Hormonal Imbalance in Men: టెస్టోస్టెరాన్ తగ్గుతోందా? బాడీ ఇచ్చే ఈ 5 సిగ్నల్స్ గుర్తించండి

Hormonal Imbalance in Men: హార్మోన్ సమస్యలు అనగానే మహిళలకు మాత్రమే అనుకుంటారు. కానీ చాలామంది పురుషులు ఇప్పుడు ఎదుర్కునే పెద్ద సమస్య హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా  'టెస్టోస్టెరాన్' అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది.  

2 Min read
Author : Nandini Arava
Published : Mar 24 2026, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పురుషులలో 'టెస్టోస్టెరాన్' అనే హార్మోన్ కీలక పాత్ర
Image Credit : chat gpt

పురుషులలో 'టెస్టోస్టెరాన్' అనే హార్మోన్ కీలక పాత్ర

సాధారణంగా హార్మోన్ల మార్పులు అనగానే కేవలం మహిళలకు మాత్రమే అనుకుంటారు. కానీ పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యానికి హార్మోన్లు అనేవి చాలా ముఖ్యం. ముఖ్యంగా పురుషులలో 'టెస్టోస్టెరాన్' అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, జీవనశైలి, డైట్ సరిగ్గా లేకపోవడవల్ల చాలామంది పురుషులు హార్మోన్ల అసమతుల్యతతో ఇబ్బంది పడుతున్నారు.శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బరువు పెరగడం
Image Credit : chat gpt

బరువు పెరగడం

మీరు డైటింగ్ చేస్తున్నా, వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గకపోవడం సరికదా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంటే అది హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన సంకేతం. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గినప్పుడు పురుషులలో మెటబాలిజం మందగిస్తుంది. దీనివల్ల కండరాల శాతం తగ్గి, కొవ్వు శాతం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పురుషులలో రొమ్ము భాగం పెరగడం కూడా సంభవిస్తుంది.

36
జుట్టు పలచబడటం, కండరాల క్షీణత
Image Credit : chat gpt

జుట్టు పలచబడటం, కండరాల క్షీణత

వయసుతో సంబంధం లేకుండా జుట్టు విపరీతంగా రాలిపోతుంటే అది హార్మోన్ల ప్రభావం కావచ్చు. కేవలం తల మీద కాకుండా గడ్డం లేదా శరీరంలోని ఇతర భాగాల్లో జుట్టు పలచబడటం గమనించాలి. అలాగే, జిమ్‌కు వెళ్లినా కండలు పెరగకపోవడం లేదా ఉన్న కండలు మెత్తబడటం కూడా హార్మోన్ల అసమతుల్యత వల్లే జరుగుతుంది. 

46
నిరంతర అలసట, నీరసం
Image Credit : Getty

నిరంతర అలసట, నీరసం

రాత్రంతా హాయిగా నిద్రపోయినప్పటికీ, ఉదయం లేవగానే తీవ్రమైన అలసటగా అనిపిస్తుందా? ఏ పని మీద ఆసక్తి కలగడం లేదా? అయితే మీ శరీరంలో హార్మోన్లు అదుపు తప్పాయని అర్థం. టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో శక్తి స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల చిన్న పని చేసినా విపరీతమైన నీరసం వస్తుంది.

56
మానసిక పరిస్థితిలో మార్పులు
Image Credit : Getty

మానసిక పరిస్థితిలో మార్పులు

హార్మోన్లు కేవలం శరీరంపైనే కాదు, మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల పురుషులలో చిరాకు, కోపం, ఆందోళన (Anxiety) పెరుగుతాయి. చాలామంది పురుషులు ఈ సమయంలో డిప్రెషన్‌కు లోనవుతుంటారు. ఏ విషయంపైనా ఏకాగ్రత నిలపలేకపోవడం కూడా ఒక ముఖ్య లక్షణం.

66
నివారణ మార్గాలేంటి?
Image Credit : Getty

నివారణ మార్గాలేంటి?

హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి మందుల కంటే జీవనశైలి మార్పులు ఎక్కువ మేలు చేస్తాయి.

రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్రలోనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.

జింక్, మెగ్నీషియం, విటమిన్ D ఎక్కువగా ఉండే ఆహారం గుడ్లు, నట్స్, ఆకుకూరలు తీసుకోవాలి.

ధ్యానం లేదా యోగా ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి.

వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి.

పైన చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తుంటే, ఒకసారి డాక్టరును సంప్రదించడం మంచిది. హార్మోన్లు అదుపులో ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
పురుషులు
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ను పెంచే హెల్తీ ఫుడ్స్ ఇవే..!
Recommended image2
Testosterone: యువకుల్లోనే టెస్టోస్టెరాన్ సమస్య..ఎందుకంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved